Tango
-
ఏనుగు–డ్రాగన్ ‘ట్యాంగో’ చేయాలి
బీజింగ్: భారత్, చైనా దేశాలు కలిసికట్టుగా పని చేయాలని చైనా అధినేత జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి లక్ష్యాల సాధనకు మనమంతా చేతులు కలపాలని సూచించారు. ప్రాథమిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏనుగు–డ్రాగన్ కలిసి ‘ట్యాంగో’డ్యాన్స్ చేయాలని ఆకాంక్షించారు. భారత్–చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏళ్లవుతున్న సందర్భంగా భారత్‌కు ఆయన మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జిన్‌పింగ్ ఒక సందేశం పంపించారు. భారత్, చైనాలు ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాలని గుర్తుచేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశాలుగా, గ్లోబల్ సౌత్‌లో ముఖ్యమైన సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆధునీకరణ ప్రయత్నాల్లో ఇరుదేశాలూ ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు జిన్‌పింగ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవడానికి, భారత్–చైనా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి భారత్‌లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.కీలక రంగాల్లో పరస్పర సహకారం మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. జిన్‌పింగ్ సందేశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిస్పందించారు. స్థిరమైన సేŠన్హ సంబంధాలు, ద్వైపాక్షిక భాగస్వామ్యం మన రెండు దేశాలతోపాటు మొత్తం ప్రపంచానికి మేలు చేస్తాయని వివరించారు. భారత్–చైనా సంబంధాలను మరింత ఉన్నత స్థానానికి చేర్చడానికి ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా ఉపయోగించాలని పేర్కొన్నారు. మరోవైపు చైనా ప్రధాని లీ ఖెకియాంగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సైత పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. -
ఆసుపత్రిలో సంగీత కచేరీలు...అక్కడ రోగులకు అదే ఔషధం!
సంగీతంతో చికిత్స అందిస్తారని మనం టీవీల్లోనూ లేదా సినిమాల్లోనూ విని ఉంటాం. నిజ జీవితంలో సంగీతంతో చికిత్స చేయడం గురించి వినటం అరుదు. మానసిక వ్యాధితో బాధపడుతున్నవాళ్లకు సంగీతంతో మార్పు తీసుకరావడం వంటివి చేస్తున్నారు. గానీ ఒక హాస్పటల్ పేషంట్ల కోసం ఏకంగా సంగీత కచేరీనే ఏర్పాటు చేసి చికిత్స అందించడం అంటే ఆశ్చర్యమే కదా. వివరాల్లోకెళ్తే..ఉరుగ్వేలో కిడ్ని రోగులకు సంగీతంతో చికిత్స అందిస్తున్నారు. మాంటెవీడియోలోని డయావెరమ్ క్లినిక్ కిడ్ని పేషంట్ల కోసం బ్యాండోనియన్ ప్లేయర్లు, గాయకులు, గిటారిస్టులు చేత సంగీత కచేరిని ఏర్పాటు చేస్తోంది. ఆ సంగీత బృందం రోగులను క్లాసిక్ టాంగో పీస్ "నరంజో ఎన్ ఫ్లోర్ వంటి సంగీతాలతో అలరిస్తారు. వాస్తవానికి కిడ్ని పేషంట్ల డయాలసిస్ చేయించుకోవడమనేది విపరీతమైన బాధతో కూడుకున్న చికిత్స. పైగా వాళ్లు వారానికి మూడుసార్లు క్లినిక్‌కి వచ్చి డయాలసిస్ చేయించుకోక తప్పదు. తమకు ఏదో అయిపోయిందన్న భావనతో నిరాశ నిస్ప్రహలతో నీరశించి పోతుంటారు. అలాంటి రోగులు ఈ సంగీత కచేరిని వింటూ... డయాలసిస్ చికిత్స తీసుకుంటారు. ఆ క్లినిక్‌లో ఉన్న రోగులంతా తాము ఇంతవరకు భయాందోళనలతో జీవతం మీద ఆశలేకుండా జీవచ్ఛవంలా బతుకుతున్నా మాకు ఈ సంగీతం మాకు కొత్త ఊపిరిని ఇస్తోందంటున్నారు. తాము రోజువారీ పనులు కూడా చేసుకునేందుకు ఆసక్తి కనబర్చలేకపోయాం. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలంటేనే భయపడే వాళ్లం అని చెబుతున్నారు. ఇప్పుడు తమకు క్లినిక్ ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారిందని ఆనందంగా చెబుతున్నారు పేషంట్లు. ఆ ఆస్పత్రిని సంగీత బృందం స్పానిష్ మ్యూజిషియన్స్ ఫర్ హెల్త్ ఎన్జీవో నుంచి ప్రేరణ పొంది ఈ స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అదీగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సంవత్సరాలుగా ఆరోగ్య వ్యవస్థల్లో కళా సంస్కృతిని చేర్చాలని సిఫార్సు చేసిందని అందుకే తాము డయాలసిస్ పేషెంట్లకు రెండు దశాబ్దాలుగా టాంగో సంగీతాన్ని అందిస్తున్నామని చెబుతోంది ఆ సంగీత బృందం. నెఫ్రాలజిస్ట్ గెరార్డో పెరెజ్ చొరవతోనే "హాస్పిటల్ టాంగో" అనే ప్రాజెక్ట్ ఏర్పాటైంది. ఇది ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో మినీ కచేరీలను నిర్వహిస్తుంది. అంతేగాదు సంగీతం వినడం వల్ల ఆందోళన ఒత్తిడి తగ్గుతుందని, హృదయ స్పందన స్థిరంగా ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలు నిరూపితమైంది కూడా. (చదవండి: కొడుకు టార్చర్ భరించలేక తల్లిదండ్రులు ఏం చేశారంటే.... ఇనుప గొలుసులతో బంధించి) -
ఒబామా ట్యాంగో డ్యాన్స్ అదుర్స్!
సాధారణంగా అధికారిక వేడుక సాదాసీదాగా చప్పగా సాగుతుంది. కానీ అర్జెంటీనాలో జరిగిన ఓ అధికారిక దౌత్య విందు మాత్రం ఆహూతులను విశేషంగా అలరించింది. అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఎందుకంటే సాక్షాత్తూ అగ్రరాజ్యం అధినేత బరాక్ ఒబామా డ్యాన్సర్‌తో కలిసి లయబద్ధంగా నృత్యం చేస్తూ.. అదుర్స్ అనిపించారు. చక్కని నైపుణ్యమున్న డ్యాన్సర్లా ఒబామా ట్యాంగో స్టెప్పులు వేశారు. లేడీ డ్యాన్సర్ మోరా గొడయ్తో కలిసి సంగీతానికి తగ్గట్టు లయబద్ధంగా ఒబామా స్టెప్పులు వేశారు. అదేసమయంలో ఒబామా సతీమణి, అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్లీ కూడా ఈ డ్యాన్స్‌లో జతకలిశారు. పురుష డ్యాన్సర్ జోస్ లాగోన్స్తో కలిసి ఆమె కూడా చక్కగా స్టెప్పులు వేశారు. ఒబామా, మిషెల్లీ స్టెప్పులతో ఈ దౌత్యవేడుకలో కొత్త జోష్ వచ్చింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అర్జెంటీనా పర్యటనలో ఉన్నారు. బుధవారం బునోస్ ఎయిరెస్లోని ఓ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన అధికారిక విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా లేడీ డ్యాన్సర్ ట్యాంగో నృత్యం చేస్తూ.. సరదాగా ఒబామా చేయిపట్టి తనతో నృత్యం చేయడానికి ఆహ్వానించారు. మొదట మొహమాట పడినా.. ఆ తర్వాత రిలాక్స్డ్గా, చాలా ఉత్సాహంగా ఒబామా స్టెప్పులు వేశారు. అటు మిషెల్లీ కూడా తన నాట్యభంగమిలతో సరదాగా గడిపింది. ఒబామాను పిలిచినప్పుడు తనకు ట్యాంగో డ్యాన్స్ రాదని చెప్పారని, అయితే జస్ట్ నన్ను ఫాలో కండి అని చెప్పానని డ్యాన్సర్ గొడయ్ తెలిపింది. 'ఆయన 'ఓకే' అని డ్యాన్స్ ప్రారంభించారు. నిజానికి ఆయన స్టెప్పులకు అనుగుణంగా నేను ఆడాను. ఎందుకంటే ఒబామా చాలామంచి డ్యాన్సర్' అని ఆమె తెలిపింది.