Russia Ukraine War: దేశం విడిచి వెళ్లేందుకు జనాల పరుగులు

Ukrainian Takes Shelter in Underground Metro Station Amid Russian Invasion - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వైమానిక దాడులతో ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలు నేలమట్టమయ్యాయి.  అయితే ఉక్రెయిన్‌లోని నగరాలపై దాడులు చేయడం లేదని రష్యా పేర్కొంది. జనావాసాలు తమ లక్ష్యం కాదని, కేవలం సైనిక స్థావరాలు, వసతులు, ఎయిర్‌ డిఫెన్స్‌, వాయుసేనను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్లు తెలిపింది. కానీ రష్యా దాడిలో సైనికులతోపాటు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.  చాల చోట్ల రష్యా క్షిపణులు జనావాసాలపై పడటంతో పౌరులు మృతి చెందుతున్నారు.
చదవండి: రష్యా ముందు పసికూన ఉక్రెయిన్‌ నిలుస్తుందా?.. బలబలాలు ఇవే..!

దీంతో ఉక్రెయిన్‌ ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ ఎయిర్‌పోర్టులు జనంతో నిండిపోయాయి. ఉక్రెయిన్ ప్రభుత్వం ఎయిర్ స్పేస్ మూసివేయడంతో అన్ని విమానాలు రద్దయ్యాయి. విమానాలు రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విమానాలకు అనుమతివ్వాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఏటీఎం, బ్యాంక్‌ల వద్ద భారీగా క్యూలైన్‌ ఏర్పడింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సబ్‌వే అండర్‌పాస్‌లో, అండర్‌గ్రౌండ్‌ మెట్రోస్టేషన్‌లలో తలదాచుకునేందకు జనాలు పరుగులు పెడుతున్నారు.  

ఉక్రెయిన్‌లో నిత్యావసరల కోసం జనాలు బారులు తీరారు. పెట్రోల్‌ బంకుల దగ్గర వాహనాలు క్యూ పెరిగింది. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రష్యా దాడి నేపథ్యంలో కీవ్‌ నగరాన్ని ప్రజలు వీడేందుకు సిద్ధపడుతున్నారు తమ నగరంపై బాంబుల మోత మోగుతుండటంతో వేరే ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. దీంతో కీవ్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు ఎవరూ రావద్దని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ తలదాచుకోవడానికి కూడా స్థలం లేదని తెలిపింది. అండర్‌ గ్రౌండ్స్‌, బంకర్లలో తలదాచుకోవాలని సూచించింది.
చదవండి: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం.. బుద్ధి బయటపెట్టిన ఇమ్రాన్‌ ఖాన్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top