Russia-Ukraine War: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం.. బుద్ధి బయటపెట్టిన పాకిస్తాన్‌ ప్రధాని

Russia Ukraine War Updates: Exciting Time To Be In Russia Says Pak PM Imran Khan - Sakshi

మాస్కో: పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన కుత్సిత బుద్ధిని మరోసారి బయటపెట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఆయన సమర్ధించారు. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ తన యుద్ధోన్మాదాన్ని చాటుకున్నారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం సంతోషాన్ని కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. సరైన సమయంలో రష్యాలో అడుగు పెట్టానని, రష్యా యుద్ధం ఎంతో ఆసక్తిని కలిగిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇమ్రాన్‌ ఖాన్‌ బుధవారం రష్యా బయల్దేరారు. దాదాపు రెండు దశాబ్ధాల తరువాత ముఖ్య నేత రష్యా వెళ్లడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు, ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఇమ్రాన్‌ చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వేళ ఆయ‌న అక్కడకు వెళ్ల‌డం ఆస‌క్తి రేపుతోంది. ర‌ష్యాకు చైనా, పాక్ ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు కొన్ని రోజులుగా సందేహాలు వ్య‌క్త‌మ‌వుతోన్న విష‌యం తెలిసిందే.
చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధం.. రష్యాకు షాక్‌!.. 5 విమానాలు, హెలికాప్టర్‌ కూల్చివేత 

ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌లోని కీవ్‌ ఎయిర్‌పోర్టు రష్యా సైన్యం అధీనంలోకి వచ్చేసింది.  రష్యా యుద్ధ విమనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రష్యా దాడిలోఉక్రెయిన్‌లో 300 మంది పౌరులు మృతి చెందారు. ఉక్రెయిన్‌లో నిత్యావసరల కోసం జనాలు బారులు తీరారు. పెట్రోల్‌ బంకుల దగ్గర వాహనాలు క్యూ పెరిగింది. 
సంబంధిత వార్త: Russia Ukraine War Updates: ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా సైన్యం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top