ఉక్రెయిన్‌ ఉక్కు వీరులు!.. ఒట్టి చేతులు.. వాటర్‌ బాటిల్‌తో బాంబులు నిర్వీర్యం | Sakshi
Sakshi News home page

Disabling Bomb: ఉక్రెయిన్‌ ఉక్కు వీరులు!.. ఒట్టి చేతులు.. వాటర్‌ బాటిల్‌తో బాంబులు నిర్వీర్యం

Published Thu, Mar 10 2022 2:42 PM

Ukrainian Specialists Seen Disabling Bomb WIth Their Bare Hands - Sakshi

Disabling Bomb Their bare hands and just a bottle of water: ఉక్రెయిన్‌ రష్యా మధ్య పోరు నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. ఒక వైపు రష్యా విదేశీయుల తరలింపు నిమిత్తం కాల్పుల విరమణ ప్రకటిస్తూనే మరోవైపు నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఉక్కెయిన్‌ చాలా ఘోరంగా అతలాకుతలమైపోతోంది. అయినప్పటికీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తమ దేశాన్ని తమ ప్రజలను రక్షించుకుంటామంటూ తమ దేశ భక్తిని చాటుతున్నారు.

మరోవైపు సైనికులు కూడా తమవంతుగా ప్రాణాలను లెక్కచేయకుండా రష్యా బలగాలకు ఎదురు నిలిచి మరీ పోరాడుతున్నారు. అత్యంత ధైర్య సాహసాలతో రష్యా సైన్యాన్ని నిలవరించడమే కాక రష్యా దాడులను తిప్పికొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందులో భాగంగా ఉక్రేనియన్ పేలుడు ఆర్డినెన్స్ డిస్పోజల్ స్పెషలిస్ట్‌ల బృందం తమ దేశంలో పేలకుండా పడి ఉ‍న్న బాంబులను కేవలం ఉత్తి చేతులతో వాటిని నేరుగా తీసి, వాటర్‌ బాటిల్‌తో నిర్విర్యం చేస్తున్నారు.

ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు తమ దేశ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆ బాంబులను నిర్విర్యం చేస్తున్న తీరుని చూస్తే మనసు చలించుపోతుందంటూ వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఉక్రెయిన్‌ వాసులు సైతం రష్య యుద్ధ ట్యాంకులకు ఎదురుగా నిలబడి మా దేశంలోకి రావద్దంటూ నినాదాలు చేసి మరీ అందర్నీ ఆశ్చర్యపరిచారు.

(చదవండి:  చీమలు క్యాన్సర్‌ కణాలను గుర్తించగలవట! ఎలాగో తెలుసా!)

Advertisement

తప్పక చదవండి

Advertisement