Viral Video: ఉప్పెనల విరుచుకుపడుతున్న ఉక్రెయిన్‌ దళాలు... ఆవిరై పోతున్న రష్యా ఆశ

Ukrainian Forces Destroyed Facility Of Russian Linked Wagner Group - Sakshi

Wagner Group Involved In Assisting Russia's War: 2014 నుంచి రష్యా ఆక్రమిత లుహాన్స్‌క్‌ మాస్కోకి సహకరిస్తున్న వాగ్నర్‌ గ్రూప్‌ స్థావరాన్ని ఉక్రెయిన్‌ బలగాలు ధ్యంసం చేశాయి. ఈ దాడిలో సుమారు 22 మంది చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్‌ తెలిపింది. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ ప్రయత్నాలకు సహాయం చేయడంలో వాగ్నర్ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు బ్రిటిష్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే.

తూర్పు ఉక్రెయిన్‌లో బీకరమైన దాడులు జరిగినట్లు లుహాన్స్‌క్‌ గవర్నర్‌ సెర్హే హేడే తెలిపారు. లుహాన్స్క్ ప్రావిన్స్‌లోని ఉక్రేనియన్ నియంత్రణలో ఉన్న సెవెరోడోనెట్స్‌క్‌ ప్రాంతంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందన్నారు. రష్యా డోనెట్స్ నదికి సమీపంలోని ఉన్న జంట పారిశ్రామిక నగరాలైన సెవెరోడోనెట్స్‌క్‌, లైసిచాన్స్‌క్‌లను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా దాడులను తెగబడింది. ఐతే ఉక్రెయిన్‌ మాస్కో సైనిక ప్రయోజనాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రైవేట్‌ కంపెనీ వాగ్నర్‌ గ్రూప్‌ పై దృష్టిసారించి ధ్వసం చేయడమే కాకుండా రష్యా ఆశల పై నీళ్లు జల్లింది. ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: రష్యా దాష్టీకం!... దాదాపు 287 మందికి పైగా ఉక్రెయిన్‌ చిన్నారులు..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top