ఉక్రెయిన్‌ ఎంబసీలకు నెత్తుటి ప్యాకేజీలు...రష్యాపై ఫైర్‌

Ukrainian Embassies Received Bloody Packages FM Blames Russia - Sakshi

వివిధ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయాలకు రక్తసిక్తమైన నెత్తుటి ప్యాకేజీలు పంపుతోంది రష్యా. మొన్నటివరకు స్పెయిన్‌, మాడ్రిడ్‌ రాయబార కార్యాలయాలకి వరుస లెటర్‌ బాంబుల పంపించి బెదిరింపులకు దిగింది. ఆ తర్వాత ఇప్పుడూ కీవ్‌ రాయబార కార్యాలయాలకు జంతువులు కళ్లు, నెత్తుటితో కూడిన అత్యంత దుర్వాసన గలిగిన ప్యాకేజీలను పంపుతోంది రష్యా. ఈ మేరకు హంగేరి, నెదర్లాండ్స్‌, పోలాండ్‌, క్రొయేషియా, ఇటలీ, ఆస్ట్రియాలోని కీవ్‌ రాయబార కార్యాలయాలకు ఈ ఘోరమైన బ్లడ్‌ ప్యాకేజీలను రష్యా పంపినట్లు సమాచారం.

అదీగాక వాటికన్‌లోని ఉక్రెయిన్‌ రాయబారి కార్యాలయం తలుపులను ధ్వసం చేసి అక్కడ మానవ మలం వదిలి వేసినట్లు ఉక్రెయిన్‌ మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే కజకిస్తాన్‌లోని ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయని సమాచారం. ఇలా బీభత్సం సృష్టించి ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడుతోందని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అన్నారు.

ఇలా నెత్తుటితో కూడిన ప్యాకేజ్‌లను పంపించి రెచ్చగొట్టు చర్యలకు పాల్పడుతోందంటూ రష్యాపై మండిపడ్డారు. దౌత్యపరంగా ఉక్రెయిన్‌ని అడ్డుకోవడం సాధ్యం గాక ఇలాంటి కుట్రలకు తెగించిందని ఆరోపణలు చేశారు. రష్యా దూకుడు గురించి తెలుసునని, గెలుపు కోసం ఎలాంటి దారుణానికైనా తెగబడుతోందని అన్నారు. ఉక్రెయిన్‌ ఎప్పుడూ సదా అప్రమత్తంగానే ఉంటుంది. అలాగే ఈ రాయబార కార్యాలయాలు సదా ఉక్రెయిన్‌ గెలుపు కోసం సమర్థవంతంగా పని చేస్తూనే ఉంటాయి అని నొక్కి  చెప్పారు. ఐతే రష్యా రాయబార కార్యాలయాలు ఆ ఆరోపణలన్నింటిని ఖండించింది. 

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top