Russia-Ukraine Crisis:ఉక్రెయిన్‌ను నట్టేట ముంచిన నాటో!

Ukraine War: No Plans To Send Troops To Ukraine Says NATO Chief - Sakshi

Russia And Ukraine war: నాటోను నమ్మిన ఉక్రెయిన్‌ నట్టేట మునిగింది. రష్యాతో యుద్ధ పరిస్థితులు తలెత్తితే ఆదుకుంటుందనుకున్న నాటో సైన్యం ఉక్రెయిన్‌కు హ్యాండ్‌ ఇచ్చింది. మరోవైపు పాశ్చాత్య దేశాలు సానుభూతి ప్రకటనలకే పరిమితమయ్యారు. దీంతో ఉక్రెయిన్‌ అరకొర ఆయుధాలతోనే ప్రపంచంలో నెంబర్‌ 3 గా ఉన్న రష్యా సైన్యంతో పోరాడుతోంది. 

రష్యా-ఉక్రెయిన్‌ వార్‌పై నాటో కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌కు నాటో బలగాలను పంపే ఆలోచన ఇప్పట్లో తమకు లేదని నాటో చీఫ్‌ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ప్రకటించారు. ఉక్రెయిన్‌లో నాటో బలగాలు లేవని, వాటిని మోహరించే ఆలోచనలు, ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. నాటో ప్రకటనతో.. ఇప్పటికే రష్యా దాడులతో చాలా ప్రాంతాల్లో విధ్వంసానికి గురైనా ఉక్రెయిన్‌ షాక్‌ తగిలింది. నాటో బలగాలపై ఉక్రెయిన్‌ ముందు నుంచి పెట్టుకున్న గంపెడు ఆశలు.. ఒక్కసారిగా అడియాశలయ్యాయి.

మరో వైపు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై మరో రౌండ్‌ దాడులతో రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్‌ సమీపంలో రష్యా బాంబుల వర్షం కుపించింది. దీంతో ఉక్రెయిన్‌ పౌరులు ప్రధాన నగరాల నుంచి దూరంగా వెళ్లిపోతున్నారు. కొంతమంది ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులకు భయాందోళనకు గురై.. ఉక్రెయిన్‌ నుంచే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లిపోతున్నారు. 

ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై ఇంతకు మించి స్పందించలేమని జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ విషయంలో రాజకీయం చర్చలు జరిపి సమస్యను సద్దుమణిగేందుకు రష్యా ముందుకురాలేని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే రష్యా అన్ని రాజీ మార్గాలను మూసేసిందని మండిపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా.. దాడి చేయడం చాలా విషాదకరమని, ఈ ప్రభావం ఉక్రెయన్‌ ప్రజలపై తీవ్రంగా పడుతుందని అన్నారు.    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top