Ukraine Russia War: ఉక్రెయిన్‌లో మళ్లీ రష్యా క్షిపణి దాడులు

Ukraine Russia War: Russian rockets slam into Ukrainian city near Europe biggest nuclear power plant - Sakshi

కీవ్‌: దక్షిణ ఉక్రెయిన్‌లోని జపొరిజాజియా సిటీలో రష్యా క్షిపణులు గర్జించాయి. క్షిపణి దాడుల్లో 40కిపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారని, కనీసం 12 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు గురువారం వెల్లడించారు. ఒకటి సూర్యోదయానికి ముందు, మరొకటి ఉదయం క్షిపణి దాడి జరిగిందని పేర్కొన్నాయి. యూరప్‌లోనే అతి పెద్దదైన అణు విద్యుత్‌ ప్లాంట్‌ జపొరిజాజియాలో ఉంది. ఈ ప్లాంట్‌ సమీపంలోనే రష్యా సైన్యం క్షిపణి దాడులు నిర్వహించడం గమనార్హం.

అణు విద్యుత్‌ ప్లాంట్‌ను రష్యా గతంలోనే ఆక్రమించుకుంది. రష్యా ఆక్రమించుకున్న తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. దీనివల్ల రష్యా అధినేత పుతిన్‌ అణ్వస్త్ర ప్రయోగానికి పాల్పడతారా? అనేది చెప్పడం కష్టమని అన్నారు. అణు దాడికి పుతిన్‌ సాహసించకపోవచ్చని తాను భావిస్తున్నాని తెలిపారు.  సిడ్నీలో లౌవీ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఓ సదస్సులో జెలెన్‌స్కీ వీడియో లింక్‌లో ప్రసంగించారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top