Russian-Ukraine: Ukraine Military Chief Key Statement On Russian Attacks Details Inside - Sakshi
Sakshi News home page

Russia-Ukraine War: మమ్మల్ని తక్కువ అంచనా వేశారు.. రష్యాకు ఉక్రెయిన్‌ కౌంటర్‌

Feb 28 2022 2:39 PM | Updated on Feb 28 2022 4:33 PM

Ukraine Military Chief Key Statement On Russian Attacks - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులను కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ ఆక్రమణే లక్ష్యంగా రష్యా బలగాలు ముందుకు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ సైన్యం వెన్ను చూపకుండా రష్యా బలగాలను ఎదుర్కొంటోంది. పూర్తి సామర్థ్యం మేరకు ఉక్రెయిన్‌ సైన్యం ఎదురుదాడికి దిగుతోంది. ఉక్రెయిన్‌తో పోరులో రష్యా సైన్యంలో వేల సంఖ్యలో మృత్యువాతపడ్డినట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ సాయుధ బలగాల జనరల్‌ స్టాఫ్‌ సోమవారం సోషల్‌ మీడియాలో కీలక ప్రకటన చేశారు. సైనిక దాడుల్లో రష్యాకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రష్యా బలగాలు నైతిక ధైర్యాన్ని కోల్పోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తమ దేశంపై రష్యా దాడుల తీవ్రత తగ్గిందన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణదారులు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని వెల్లడించారు. ఇ‍ప్పటి వరకు ఉక్రెయిన్‌ బిగ్రేడ్స్‌.. తమ శత్రువు యుద్ధ వాహనాలను, సైనికులకు దెబ్బతీశాయని స్పష్టం చేశాయి. ప‍్రస్తుతం ఉక్రెయిన్‌లో వాస్తవ పరిస్థితులను చూసి రష్యా భయపడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మరోవైపు ఉక్రెయిన్‌పై సైనిక దాడుల్లో రష్యా బలగాలు ఆగ్నేయ ప్రాంతంలోని జపోరిజ్జియా అణువిద్యుత్‌ ప్లాంట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అనంతరం బెర్డ్‌యాన్‌స్క్‌, ఎనర్‌హోదర్‌ పట్టణాలను సైతం రష్యా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.


  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement