Ukraine‌ Army : ఉక్రెయిన్‌ ఆర్మీ ఆసక్తికర ప్రకటన.. రష్యా ఈ తేదీనే యుద్ధం ముగించనుందా?

Ukraine Army Predicts Russia Will End War On May 9th - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 30వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరవైపుల నుంచి శాంతి చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోగా.. యుద్ధంతో నష్టం ఇరువైపులా భారీగానే నమోదు అవుతోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్‌ ఆర్మీ చేసిన ప్రకటన ఒకటి ఆసక్తికర చర్చకు దారి తీసింది. 

ఈ యుద్ధాన్ని రష్యా మే 9వ తేదీన ముగించాలని భావిస్తోందని ఉక్రెయిన్‌​ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ తేదీనే ఎందుకనే దానికీ ఒక ప్రత్యేకత ఉంది. నాజీ జర్మనీపై తమ విజయానికి గుర్తుగా ఆరోజు రష్యా ‘విక్టరీ డే’ పేరుతో దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుతుంటుంది. కాబట్టి, అదే రోజున ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించి.. ప్రకటన చేసుకునే(ఎలాంటిదనేది చెప్పలేదు) అవకాశం ఉందని రష్యా ఆర్మీ అంచనా వేస్తోంది. విక్టరీ డే అనేది 1945లో గ్రేటర్ జర్మన్ రీచ్ లొంగిపోయినందుకు గుర్తుచేసే సెలవుదినం.

ఈ  మేరకు ఉక్రెయిన్‌ ఆర్మ్‌డ్‌ బలగాల్లోని జనరల్‌ స్టాఫ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగపు సమాచారం ప్రకారం ఉక్రెయిన్‌ ఆర్మీ ఈ ప్రకటన విడుదల చేసినట్లు.. ది కీవ్‌ ఇండిపెండెట్‌ మీడియా హౌజ్‌ ట్వీట్‌ చేసింది.  

ఉక్రెయిన్‌ పౌరుల కిడ్నాప్‌!
ఇదిలా ఉండగా రష్యాపై ఉక్రెయిన్‌ సంచలన ఆరోపణలకు దిగింది. ఉక్రెయిన్‌ నుంచి పౌరులను రష్యా బలగాలు బలవంతంగా మాస్కో తరలిస్తున్నాయని, తద్వారా వాళ్లను బంధీలుగా చేసుకుని రాజధాని కీవ్‌ను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపిస్తోంది. ఈ మేరు 4 లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులను (అందులో 84,000 మంది పిల్లలు) కిడ్నాప్‌ చేసిందని ఉక్రెయిన్‌ ఆంబుడ్స్‌మన్‌ ల్యుద్‌మైల డెనిసోవా ఆరోపిస్తున్నారు. అయితే రష్యా మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top