ఐస్‌క్రీమ్‌ చల్లగా ఉందేంటి, నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి.. కస్టమర్‌ ఫిర్యాదు

Uk Customer Complains Ice Cream Served Too Cold Gets Money Refund - Sakshi

గతంలో పుడ్‌ తినాలంటే హోటల్‌కి వెళ్లి తినేవాళ్లం. కానీ స్విగ్గి, జొమాటో లాంటి ఆన్‌లైన్‌ యాప్‌లు వాడకంలోకి వచ్చాక కూర్చున్న చోటు నుంచే నచ్చిన పుడ్‌ని తెప్పించుకు తింటున్నాం. కస్టమర్ల సౌకర్యం కోసం ఆన్‌లైన్‌ పుడ్‌ డెలివరీ యాప్‌లు కొన్ని రూల్స్‌ని పాటిస్తుంటాయి. అయితే కొందరు కస్టమర్లు మాత్రం వీటిని అలుసుగా తీసుకుని డబ్బులు ఇవ్వకుండా కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఇటువంటి ఘటనలే యూకేలోని ఓ హోటల్‌లో చోటు చేసుకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. యూకేలోని ఓల్డ్‌హామ్‌లో హాస‌న్ హాబిబ్ అనే వ్యక్తికి జ‌స్ట్ ఈట్ అనే రెస్టారెంట్ ఉంది. అన్ని హోటల్‌లో లానే అందులో టేక్ అవే సౌకర్యం ఉంది. ఆ ప్రాంతంలో పుడ్‌ సరిగా లేకుంటే మనీ రీఫండ్‌ లాంటి స్వీమ్‌లు కొన్ని కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే కొందరు దాన్నే అదునుగా తీసుకుని ఫుడ్ ఆర్డర్ చేస్తూ డెలివ‌రీ అయ్యాక ఏదో ఒక సాకులు చెప్పి.. డబ్బులు రిఫండ్ చేయాలంటూ రెస్టారెంట్‌పై ఫిర్యాదులు చేస్తున్నార‌ట‌. ఇటీవల ఓ కస్టమర్‌.. ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసి డెలివ‌రీ కాగానే ఐస్‌క్రీమ్‌ చల్లగా ఉంది నాకేమి నచ్చలేదు మ‌నీ రిఫండ్ చేయాల‌ని రిక్వెస్ట్‌ పెట్టాడట.

ఇదొక్కటే కాదు ఇలాంటి  సిల్లీ కార‌ణాల‌తో మ‌నీ రిఫండ్ చేయాలని ఫిర్యాదులు రోజు వస్తూనే ఉండడంతో ఆ రెస్టారెంట్ ఓన‌ర్ ఆన్‌లైన్ ఆర్డ‌ర్స్‌, టేక్ అవేని ఆపేశాడ‌ట‌. చివరకి ఆ రెస్టారెంట్‌ యజమాని తన కస్టమర్లు ఎవరైనా ఫుడ్‌పై ఫిర్యాదు చేయాల‌నుకుంటే.. దానికి కొంత చార్జ్ వ‌సూలు చేయ‌డం మొద‌లు పెట్టాడు.  క‌నీసం 30 రోజుల గడువు తీసుకొని ఆలోపు కస్టమర్ల ఫిర్యాదులో పేర్కొన్న విధంగా స‌మ‌స్య ఉంటే.. రిఫండ్ ఇవ్వడం ప్రారంభించారు.

చదవండి: వర్క్‌ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top