ట్రంప్, బైడన్‌ యాడ్స్‌ ఖర్చు 502 కోట్లు

Trump And Biden Spent 502 Crore On Social Media Advertising - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి డబ్బు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చవుతుందంటే ఆశ్చర్యం వేస్తోంది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డోనాల్డ్‌ ట్రంప్, జో బైడెన్‌లు జూన్‌ ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్‌ 13వ తేదీ వరకు, అంటే 105 రోజుల్లో ఒక్క సోషల్‌ మీడియాకు ఇద్దరు సంయుక్తంగా ఇచ్చిన అండ్వర్టయిజ్‌మెంట్లపైనే ఏకంగా 68.8 మిలియన్‌ అమెరికా డాలర్లు (దాదాపు 502 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వారు ఆగస్టు పదవ తేదీ నుంచి సెప్టెంబర్‌ 13వ తేదీ మధ్యనే 40 శాతం సొమ్మును, అందులోనూ ఎక్కువగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపైనే ఖర్చు చేశారని సైరాక్యూస్‌ యూనివర్శిటీ ఓ అధ్యయనంలో బయట పెట్టింది. 

ఆగస్టు పది నుంచి సెప్టెంబర్‌ 13 మధ్య, నెలరోజుల్లో ఆన్‌లైన్‌ యాడ్స్‌కు 27 మిలియన్‌ డాలర్లు (దాదాపు 197 కోట్ల రూపాయలు) ఖర్చు పెట్టారని తెలిపింది. 2016 సంవత్సరంలో డోనాల్డ్‌ ట్రంప్, హిల్లరీ క్లింటన్‌ పోటీ పడినప్పుడు కూడా దాదాపు ఇదే స్థాయిలో ఖర్చు పెట్టారని యూనివర్శిటీ పరిశోధకులు ఓ ప్రాజెక్ట్‌లో భాగంగా సేకరించిన వివరాల మేరకు తెలిపారు. 
(చదవండి: యూఎస్‌ మార్కెట్లకు ట్రంప్‌ జోష్)

అధ్యక్ష ఉన్నికల్లో పోటాపోటీగా యాడ్స్‌ కోసం ఖర్చు పెడుతున్న ట్రంప్, బైడెన్‌లు అందులో 70 శాతం నిధులను కేవలం ఓటర్లను ఆకర్షించేందుకు ఖర్చు పెడుతుండగా, 30 శాతం నిధులను ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడే ఓటర్లను సమీకరించేందుకు ఖర్చు పెడుతున్నారు. అమెరికాలో టీవీలో యాడ్‌ ఇవ్వడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అవడం వల్ల ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు కూడా సోషల్‌ మీడియాకే ఎక్కువ యాడ్స్‌ ఇస్తున్నారు. అమెరికా టీవీలో ప్రైమ్‌ టైమ్‌లో 30 నిమిషాల యాడ్‌ ఇవ్వాలంటే అక్షరాల లక్ష డాలర్లు. అంటే, దాదాపు 73 లక్షల రూపాయలు. 

టీవీ యాడ్‌ కోట్ల మంది ప్రజల ముందుకు వెళుతుంది కనుక యాడ్‌ టారిఫ్‌ లక్ష డాలర్లలో ఉంటుంది. సోషల్‌ మీడియా లక్షల మందికి మాత్రమే వెళుతుంది కనుక యాడ్‌ టారిఫ్‌ వేల డాలర్లలో ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికాలో ప్రింట్, రేడియో, బిల్‌బోర్డు యాడ్‌లు చాలా తక్కువ. అయితే అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం యాడ్స్‌కు ఖర్చు పెట్టే సొమ్ములో కేవలం 5 శాతం మాత్రమే ఈ మూడు మీడియాలపై ఖర్చు పెడతారట. డోనాల్డ్‌ ట్రంప్‌ పురష ఓటర్లు లక్ష్యంగా ఎక్కువ యాడ్స్‌ ఇస్తుండగా, అందుకు భిన్నంగా బైడెన్‌ మహిళా ఓటర్లు లక్ష్యంగా ఎక్కువ యాడ్స్‌ ఇస్తున్నారు. 
(చదవండి: కమలా హారిస్‌పై ట్రంప్‌ తీవ్ర విమర్శలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top