ఎంజాయ్‌ చేద్దామని వెళ్తే ఊహించని షాక్‌.. పెండ్యులం రాడ్‌ విరగడంతో..

Tourists Hang Upside Down On Broken Amusement Park Ride At China - Sakshi

డ్రాగన్‌ కంట్రీ చైనాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఎంజాయ్‌మెంట్‌ కోసమని అమ్యూజ్‌మెంట్‌కు వెళ్లిన పర్యాటకులకు ఊహించని షాక్‌ తగిలింది. అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో పెండ్యులంపై రైడ్‌ చేస్తున్న క్రమంలో రాడ్‌ విరిగిపోవడం వారంతా తలక్రిందులుగా వేలాడారు. దీంతో, వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయినంత పనైపోయింది. 

వివరాల ప్రకారం.. చైనాలోని అన్‌హుయ్‌ ప్రావిన్స్‌లోని ఫుయాంగ్‌ నగరంలో అ‍మ్యూజ్‌మెంట్‌ పార్క్‌ ఉంది. దీన్ని సందర్శించేందుకు కొందరు పర్యాటకులు పార్క్‌కు వచ్చారు. ఈ క్రమంలో అక్కడున్న గేమ్‌ ఆడేందుకు పర్యాటకులు ఆసక్తి చూపించారు. ఇందులో భాగంగానే పార్క్‌లో ఉన్న పెండ్యులంపై రైడ్‌ చేసేందుకు కొందరు పర్యాటకులు ముందుకు వచ్చారు. దీంతో, పార్క్‌ సిబ్బంది పెండ్యులం రైడ్‌ను ప్రారంభించిన కొద్దిసేపటికే దాని పెద్ద రాడ్‌ విరిగిపోయింది. దీంతో, దానిపై ఉన్న వారంతా ఒక్కసారిగా తలకిందులుగా వేలాడుతూ గట్టిగా అరుస్తూ భయాందోళనకు గురయ్యారు.  ఇలా దాదాపు 10 నిమిషాల పాటు గాలిలోనే ఉన్నారు. 

రాడ్‌ విరిగిన సమయంలో పెండ్యులం చాలా ఎత్తులో ఉన్నది. దీంతో షాకైన సిబ్బంది వెంటనే అప్రమతమయ్యారు. అనతంరం, రైడ్‌ను సరిసేందుకు సిబ్బంది నానా కష్టాలు పడ్డారు. ఎంతకీ సరికాకపోవడంతో తలలు పట్టుకున్నారు. తర్వాత ఒక వ్యక్తి ఆ రైడ్‌ పైభాగానికి వెళ్లి దానిని సరిచేశాడు. దీంతో, పర్యాటకులు కిందకు దిగారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఎక్కువ మంది ఎక్కడం వల్లనే ఈ సమస్య వచ్చిందని అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో అనారోగ్యానికి గురైన వారికి వైద్య ఖర్చులపరంగా సహాయం చేస్తామని వెల్లడించారు. ఇక, ఈ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top