 
													అమెరికాలోని కాలిఫోర్నియాలోగల స్టాక్‌టన్‌లో వేలకొద్దీ చిరుకప్పులు ఒక రోడ్డును దాటుతున్నాయి. ఇది చిరు కప్పల సామూహిక వలసగా కనిపించింది. ఒక మైలు పొడవునా విస్తరించిన ఈ రోడ్డు పొడవునా చిరు కప్పలు ఉండటాన్ని చూసినవారు తెగ ఆశ్చర్యపోతున్నారు.
విమానాశ్రయం నుండి ఇంటికి కారులో వెళుతున్న ఈ ప్రాంతానికి చెందిన మేరీ హులెట్ రోడ్డుపై ఎదో కదులుతున్నట్లు కనిపించడంతో ముందునున్న కార్లు ఆగిపోవడాన్ని తాను గమనించానని తెలిపింది. రోడ్డుపై దృష్టి కేంద్రీకరించినప్పుడు కప్పల సైన్యం రహదారికి అడ్డుగా ఉందని గ్రహించానని ఆమె పేర్కొంది. ఇవి రహదారిని దాటడాన్ని గమనించానని ఒక వార్తా సంస్థకు ఆమె తెలిపింది.
ఈ విధంగా కప్పల వలసలను చూసిన జీవశాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు. సిల్వర్ అవెన్యూలో ఎస్ కర్వ్స్ అని పిలిచే ప్రాంతంలో ఈ చిరు కప్పలు  కనిపించాయి. వైల్డ్‌లైఫ్ రిసోర్సెస్ సెంట్రల్ రీజియన్‌లోని ఉటా విభాగానికి చెందిన ఆక్వాటిక్స్ మేనేజర్ క్రిస్ క్రోకెట్ మాట్లాడుతూ ఈ కప్పలను గ్రేట్ బేసిన్ స్పాడెఫుట్ టోడ్స్ అని అంటారన్నారు. అవి చుట్టుపక్కల ఉన్న కొండలకు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు. కాగా కొన్ని కార్లు ఆ చిరు కప్పల మీదుగా వెళ్లడంతో చాలా చిరుకప్పలు చనిపోయాయి. అయితే స్థానికులు ఈ కప్పలను కాపాడేందుకు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: హవ్వ.. గన్ను కొనడం ఇంత సులభమా?
 
Witnesses describe seeing a 'biblical' mass migration of toads over a mile long pic.twitter.com/ii0HUn8DD4
— CNN (@CNN) July 24, 2023

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
