టిక్‌టాక్‌ బ్యాన్‌పై ట్రంప్‌ వెనక్కి..

tiktok deal with oracle In USA - Sakshi

వాషింగ్టన్‌ : జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్‌ టాక్, వీ చాట్‌ లను ఆదివారం నుంచి నిషేధిస్తూ అమెరికా జారీచేసిన ఆదేశాలపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అమెరికాలో బహుళజాతి కంప్యూటర్‌ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్‌తో టిక్‌టాక్‌ జట్టు కట్టేందుకు గ్నీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అగ్రరాజ్యంలో తమ కార్యకలాపాల కోసం సాంకేతిక భాగస్వామిగా కొనసాగించేందుకు ఒరాకిల్‌-వాల్‌మార్ట్‌ టిక్‌టాక్‌ యాజమాన్యం వేదికగా ఎంచుకుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవాలన్న మైక్రోసాఫ్ట్‌-వాల్‌మార్ట్‌ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాగా టిక్‌టాక్‌, వీ చాట్‌ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్‌ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం సెప్టెంబర్‌ 20 నుంచి నిషేదం అమల్లోకి రానుంది. అయితే తాజా ఒప్పందం ప్రకారం.. ఈ గడువును సెప్టెంబర్‌ 27 వరకు పెంచినట్లు తెలుస్తోంది. టిక్‌టాక్‌, ఒరాకిల్‌ మధ్య డీల్‌కు అమెరికా ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఆమోదముద్ర పడనుంది. దీనిపై ట్రంప్‌ ఇదివరకే తుది నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిక్‌టాక్‌, వీచాట్‌ల బ్యాన్‌.. చైనా స్పందన)

జాతీయ భద్రతకు ముప్పుగా చూపుతూ దేశీయ కార్యకలాపాలను అమెరికా సంస్థకు అమ్ముకోకపోతే ఈ నెల 20 నుంచి టిక్‌టాక్‌ యాప్‌పై నిషేధం విధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒరాకిల్‌ చేతికి అమెరికా టిక్‌టాక్‌ ఆపరేషన్స్‌ వచ్చాయి. అయితే ఈ డీల్‌ విలువ, టిక్‌టాక్‌లో ఒరాకిల్‌కు మెజారిటీ వాటా ఏదైనా దక్కబోతున్నదా? అన్న వివరాలపై మాత్రం స్పష్టత లేదు.. అమెరికాలో టిక్‌టాక్‌ వ్యాపారాన్ని సుమారు రూ.1.84 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ డీల్‌కు అమెరికా ప్రభుత్వం అనుమతి కూడా రావాల్సి ఉన్నది. మరోవైపు టిక్‌టాక్ యుఎస్ కార్యకలాపాలను సంపాదించడానికి ఆసక్తి ఉందని మైక్రోసాఫ్ట్ ఆగస్టు ప్రారంభంలో తెలపగా.. దానిని టిక్‌టాక్‌ యాజమాన్యం సున్నితంగా తిరస్కరించింది. చివరికి ఒరాకిల్ సంస్థ టిక్ టాక్ కొనుగోలుకు సిద్ధమైంది. దీంతో పూర్తి హక్కులు అమెరికా సంస్థదై ఉండాలన్న తన వాదనకు ఒరాకిల్‌ కట్టుబడి ఉంది. అంతేకాదు ఈ ఒప్పందం ద్వారా గణనీయమైన వాటా ప్రభుత్వ ఖజానాకు చేరాలనేది ట్రంప్ ప్రధాన ఉద్దేశం కూడా నెరవేరనుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top