అమెరికా బెదిరింపు చర్యలు మానుకోవాలి

China Accuses US Of Bullying After TikTok and WeChat Ban - Sakshi

బీజింగ్‌: జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సోషల్‌మీడియా యాప్‌లు టిక్‌టాక్‌, వీ చాట్‌లను ఆదివారం నుంచి నిషేధిస్తూ అమెరికా ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. దీనిపై చైనా శనివారం స్పందించింది. అమెరికా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంతత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘బెదిరింపులను మానుకోవాలని, (దాని) తప్పుడు చర్యలను నిలిపివేయాలని.. న్యాయమైన, పారదర్శక అంతర్జాతీయ నియమాలను, ఆర్డర్లను ఖచ్చితంగా పాటించాలని చైనా అమెరికాను కోరుతోంది అని తెలిపింది. అంతేకాక అమెరికా తనదైన మార్గంలో వెళ్లాలని పట్టుబడుతుంటే, చైనా కంపెనీల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా తెలిపింది. అమెరికా జారీ చేసిన ఆర్డర్ ప్రకారం, టెన్సెంట్ యాజమాన్యంలోని వీచాట్ యాప్‌ ఆదివారం నుంచి అగ్రరాజ్యంలో తన కార్యాచరణను కోల్పోతుంది. ఇక టిక్‌టాక్‌పై ప్రసస్తుతం అప్‌డేట్‌ ఇన్‌స్టాల్ చేయకుండా నిషేధం విదించారు. కాకపోతే నవంబర్ 12 వరకు టిక్‌టాక్‌ను యాక్సెస్ చేయవచ్చు. (చదవండి: అందుకే ఆ యాప్స్‌పై నిషేధం)

సెప్టెంబర్‌ 15లోపు, టిక్‌టాక్‌, వీ చాట్‌ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్‌ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. చైనా దురుద్దేశంతో అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, జాతీయ, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడానికి  అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్టు యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ విల్‌బుర్‌ రాస్‌ చెప్పారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top