కోవిడ్‌కు చికిత్స లేకపోవచ్చు: డబ్ల్యూహెచ్‌వో

There May Never Be A COVID-19 Silver Bullet Says WHO - Sakshi

జెనీవా: కరోనా వైరస్‌ టీకా రూపకల్పనకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ సులభమైన పరిష్కారం ఏదీ ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వ్యాఖ్యానించింది. అందుకే, కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు టెస్టింగ్, ట్రేసింగ్, భౌతికదూరం, మాస్క్‌ ధరించడం వంటి ప్రాథమిక అంశాలపైనే ప్రభుత్వాలు, పౌరులు దృష్టి పెట్టాలని సూచించింది.

‘ప్రస్తుతానికైతే ఈ మహమ్మారిని రూపుమాపే సులువైన అద్భుత చికిత్సేదీ లేదు..ఎప్పటికీ రాకపోవచ్చు కూడా..’అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెసియస్‌ మీడియాతో అన్నారు. చైనాలో ఈ వైరస్‌ మనుషుల్లోకి ఎలా ప్రవేశించిందనే విషయమై విచారణ జరిపేందుకు డబ్ల్యూహెచ్‌వో పంపిన ఇద్దరు సభ్యుల బృందం తన ప్రాథమిక విచారణను ముగించిందని ఘెబ్రెసియస్‌ తెలిపారు. త్వరలోనే వైరస్‌ మూలాలను కనుగొనేందుకు డబ్ల్యూహెచ్‌వో నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం చైనా పరిశోధకులతో కలిసి ప్రయత్నించనుందన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top