కృష్ణబిలం పుట్టింది!

Surprisingly spherical neutron explosion was bright as a billion suns - Sakshi

అంతరిక్షంలో ఒక అరుదైన దృగ్విషయం సైంటిస్టుల కంటబడింది! రెండు న్యూట్రాన్‌ నక్షత్రాలు పరస్పరం కలిసిపోయి కిలోనోవాగా పేర్కొనే భారీ పేలుడుకు దారి తీయడమే గాక, చూస్తుండగానే శక్తిమంతమైన కృష్ణబిలంగా రూపొంతరం చెందాయి.

ఇటీవలి కాలంలో అంతరిక్షంలో చోటుచేసుకున్న అత్యంత శక్తిమంతమైన పేలుడు ఇదేనని నాసా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో రెండు తారలూ కలిసిపోయి కొద్దిసేపు ఒకే తారగా మారి అలరించాయట. ఈ మొత్తం ఎపిసోడ్‌ను చిలీలోని యూరోపియన్‌ సదరన్‌ అబ్జర్వేటరీ నుంచి సైంటిస్టులు సంభ్రమాశ్చర్యాలతో వీక్షించారు. ఇదంతా మనకు 1.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎన్‌జీసీ4993 గెలాక్సీలో చోటుచేసుకుందట.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top