6 పాయింట్లలో సునీతా విలియమ్స్‌ లైఫ్‌ స్టోరీ! | Sunita Williams Space Career In International Space Station | Sakshi
Sakshi News home page

Sunita Williams Birthday: 6 పాయింట్లలో సునీతా విలియమ్స్‌ లైఫ్‌ స్టోరీ!

Sep 19 2023 1:01 PM | Updated on Sep 19 2023 1:06 PM

sunita williams space career international space station - Sakshi

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ నేడు 57వ వసంతంలోకి అడుగుపెట్టారు. సునీతా విలియమ్స్ 1965,సెప్టెంబర్ 19న ఒహియోలోని యూక్లిడ్ నగరంలో జన్మించారు. భారత సంతతికి చెందిన సునీత 195 రోజులకు పైగా అంతరిక్షంలో ఉండి ప్రపంచ రికార్డు సృష్టించారు.

1 సునీతా విలియమ్స్ కుటుంబం
సునీతా విలియమ్స్ తండ్రి డాక్టర్ దీపక్ ఎన్. పాండ్యా ఆయన భారతదేశంలోని గుజరాత్‌కు చెందినవారు. తల్లి బోనీ జలోకర్ పాండ్యా.. స్లోవేనియాకు చెందినవారు. సునీతకు ఏడాది వయసున్నప్పుడు ఆమె తండ్రి అహ్మదాబాద్ నుండి యూఎస్‌ఏలోని బోస్టన్‌కు వలస వచ్చారు. సునీతా విలియమ్స్‌కు అన్నయ్య జై థామస్ పాండ్యా, అక్క డయానా ఆన్ పాండ్యా ఉన్నారు. సునీత మైఖేల్ జెని వివాహం చేసుకున్నారు. అతను సునీతా విలియమ్స్ క్లాస్‌మేట్.

2 ప్రాథమిక విద్య
సునీతా విలియమ్స్ మసాచుసెట్స్‌లోని నీధమ్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆమె యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ డిగ్రీని అందుకున్నారు.

3 అంతరిక్ష ప్రయాణ శిక్షణ
సునీతా విలియమ్స్ 1987లో యూఎస్‌ నేవీలో చేరారు. ఆరు నెలల తాత్కాలిక నియామకం తర్వాత ఆమె ప్రాథమిక డైవింగ్ అధికారిగా నియమితులయ్యారు. సునీతా విలియమ్స్ 1998లో అంతరిక్ష యాత్రలో శిక్షణ మొదలుపెట్టారు.

4 195 రోజులు అంతరిక్షంలో గడిపిన రికార్డు
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన రెండో మహిళ సునీతా విలియమ్స్. వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 195 రోజుల పాటు ఉండి రికార్డు సృష్టించారు.

5 సునీతా విలియమ్స్ సాధించిన విజయాలు
సునీతా విలియమ్స్ 1998, జూన్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు ఎంపికై అక్కడ శిక్షణ తీసుకున్నారు. సునీత అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ‘నాసా’ (1998) మిషన్ ఎస్‌టీఎస్‌ 116, ఎక్స్‌పెడిషన్ 14, ఎక్స్‌పెడిషన్ 15, ఎస్‌టీఎస్‌ 117, సోయుజ్ టీఎంఏతో సహా 30 వేర్వేరు అంతరిక్ష నౌకల్లో మొత్తం 2770 విమానాలను నడిపారు. 

6 పద్మభూషణ్‌తో సత్కారం
సునీతా విలియమ్స్‌కు 2008లో భారత ప్రభుత్వం సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఇదేకాకుండా ఆమె మానవతా సేవా పతకం, నేవీ అండ్‌ మెరైన్ కార్ప్ అచీవ్‌మెంట్ మెడల్, నేవీ కమెండేషన్ మెడల్‌లను అందుకున్నారు. 
ఇది కూడా చదవండి: జోడియాక్‌ కిల్లర్‌ ఎవరు? సీరియల్‌ హత్యలు చేస్తూ, వార్తాపత్రికలకు ఏమని రాసేవాడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement