అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

Student Gun Firing Tragedy Michigan High School In America - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో ఒక పాఠశాలలో కాల్పుల ఉదంతం కలకలం రేపింది. మిషిగాన్‌ స్కూల్‌లో ఒక విద్యార్థి.. తోటి విద్యార్థులపై గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. 

ఒక్కసారిగా స్కూల్‌ ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది. స్కూల్‌ సిబ్బంది, విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా, సమాచారం అందుకున్న  స్థానిక పోలీసులు మిషిగాన్‌ స్కూల్‌కు చేరుకుని కాల్పులు జరిపిన కుర్రాడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గాయపడిన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన విద్యార్థి ఈ మధ్యనే హ్యండ్‌ గన్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top