అణుయుద్ధం జరిగినప్పుడూ... జుట్టుకి కండీషనర్‌ వద్దు..హెచ్చరించిన పుతిన్‌

Should Avoid Conditioners After Nuclear Explosion - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. అదీగాక గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌ సేనలు పుంజుకుంటూ రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాలన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకుంటూ విజయ ఢంకా మోగించనుంది. ఈ తరుణంలో ఉక్రెయిన్‌కి అడ్డుకట్టేవేసేలా... రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పెద్ద సంఖ్యలో సైనిక బలగాలను సమీకరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఒక వేళ రష్యా ఓడిపోతానన్న అనుమానం తలెత్తిన వెంటనే అణుదాడులకు దిగుతుందని ప్రపంచ దేశాలు భయాందోళనలు వ్యక్తం చేశాయి.

ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అణుయుద్ధం జరిగేటప్పుడూ జుట్టుకి కండిషనర్‌ని ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని స్వయంగా పుతిన్‌ చెప్పినట్లు అమెరికా చెబుతుంది. ఈ మేరకు అమెరికా తన పౌరులకు అలాంటి విపత్కర సమయాల్లో చేయాల్సినవి, చేయకూడనవి విషయాలు గురించి వివరించింది. అణు యుద్ధం సమయంలో హెయిర్‌ కండీషనర్‌ వినియోగించటం ప్రాణాంతకమని పేర్కొంది.

అంతేగాదు అణుబాంబు పేలితే రేడియోధార్మిక ధూళిని మేఘాలు గాల్లోకి నెట్టేస్తాయి. అలాంటి సమయాల్లో వీలైనంత త్వరగా షాంపుతో తల స్నానం చేయాలని సూచించింది. దీనివల్ల సురక్షితంగా ఉండే అవకాశాలు ఎక్కువ శాతమని తెలిపింది. తలస్నానం చేసిన వెంటనే కండీషనర్‌ని మాత్రం వినియోగించొద్దు అని సలహ ఇచ్చింది. షాంపూ జుట్టుని శుభ్రపరిస్తే..కండీషనర్‌లోని సర్ఫ్యాక్టెంట్లు నీటీని, నూనెను ఆకర్షిస్తాయని చెప్పింది.

ఈ కండీషనర్‌, మీ జుట్టుకి రేడియోధార్మిక వంటి పదార్థాల మధ్య జిగురులా పని చేస్తుంది. దీంతో ఈ రేడియోథార్మిక పదార్థాలు జుట్టును గట్టిగా అంటిపెట్టుకుని ఉండిపోతాయని, దీంతో ప్రాణాంతకంగా మారుతోందని అమెరికా హెచ్చరించింది. అలాగే ఇలాంటి అణు విస్పోటనం జరిగినప్పుడూ...రేడియేషన్‌ని నివారించటానికి ఇటుక లేదా కాంక్రీట్‌ భవనంలో ఆశ్రయం పొందాలని, కళ్లు, ముక్కు, నోటిని చేతులతో తాకకూడదని సూచించింది.

(చదవండి: ఉక్రెయిన్‌ని నివారించేలా రష్యా ఎత్తుగడ.. పశ్చిమ దేశాలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top