మతం పేరుతో హింసకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు | Sheikh Hasina Asks Home Minister Take Actions On Hindu Temples Attacked | Sakshi
Sakshi News home page

మతం పేరుతో హింసకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు

Oct 20 2021 4:22 AM | Updated on Oct 20 2021 11:57 AM

Sheikh Hasina Asks Home Minister Take Actions On Hindu Temples Attacked - Sakshi

ఢాకా: దేశంలో మతాన్ని అడ్డుపెట్టుకుని హింసకు పాల్పడేవారిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా మంగళ వారం హోం మంత్రిని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏ విషయాన్నైనా నిజానిజాలు తెలుసుకోకుండా నమ్మవద్దని ప్రజలను ఆమె కోరారు. గత బుధవారం దుర్గాపూజల సంద ర్భంగా దైవదూషణ జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టింగ్‌ల ప్రభావంతో హిందువుల ఆలయాలపై ప్రారంభమైన దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాని హసీనా పరిస్థితులను సమీక్షించారు. మతపరమైన హింసకు పాల్పడే వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అసదుజ్జమాన్‌ ఖాన్‌ను ఈ సందర్భంగా హసీనా ఆదేశించారు. కాగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌ జిహాదీస్తాన్‌గా మారిపోయిందని ఆమె మంగళవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement