ఫుడ్‌ ప్యాక్‌లో ఎలుక | Scandinavian Airlines flight diverted after passenger finds live mouse in meal | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ ప్యాక్‌లో ఎలుక

Sep 23 2024 5:42 AM | Updated on Sep 23 2024 5:42 AM

Scandinavian Airlines flight diverted after passenger finds live mouse in meal

విమానం అత్యవసర ల్యాండింగ్‌ 

అవున్నిజమే! విమానంలో ఎలుక కనిపించింది. అంది కూడా ఓ ప్రయాణికురాలికి అందించిన ఫుడ్‌ పార్సిల్లో. ఆమె పార్సిల్‌ తెరవగానే ఎలుక అమాంతం బయటికి దూకి సీట్ల కింద దూరింది! దాంతో విమానంలో కలకలం రేగింది. నార్వే రాజధాని ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మలగాకు వెళ్తున్న స్కాండినేవియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో జరిగిందీ ఘటన. ఆ దెబ్బకు విమానాన్ని అత్యవసరంగా కోపెన్‌హాగన్‌లో దించారు.

 ప్రయాణికులను వేరే విమానంలో మలగాకు పంపించారు. విమానాల్లోని ఎలకి్ట్రకల్‌ వైరింగ్‌ తదితరాలను ఎలుకలు కొరికాయంటే అంతే సంగతులు. అందుకే అవి విమానంలోకి రాకుండా ఎయిర్‌లైన్స్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి! అలాంటిది ఏకంగా ఫుడ్‌ పార్సల్లోనే బతికున్న ఎలుక రావడాన్ని ఎయిర్‌లైన్స్‌ సంస్థ సీరియస్‌గా తీసుకుంది. ఆహార పంపిణీ సంస్థను వెంటనే బ్లాక్‌ లిస్టులో పెట్టింది. ప్రయాణికులను క్షమాపణ కోరింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పుకొచ్చింది. ఇటీవల దక్షిణ ఇంగ్లాండ్‌లో రెండు ఉడతలు రైలెక్కడంతో చివరకు ఆ సరీ్వసును రద్దు చేయాల్సి వచి్చంది!                    

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement