ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా గిన్నిస్‌ రికార్డు | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా గిన్నిస్‌ రికార్డు

Published Sun, Oct 2 2022 8:51 PM

Savannah Breed Become Worlds Tallest Pet Cat To Guinness Records - Sakshi

ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా సవన్నా జాతికి చెందిన పెంపుడు పిల్లి గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. ఇది ఒక ఫెన్నిర్‌ అంటారెస్‌ పవర్స్‌ అనే హైబ్రిడ్‌ జాతికి చెందిన పిల్లి అని యజమాని డాక్టర్‌ విలియం జాన్‌ పవర్స్‌ తెలిపారు. ఈ సవన్నా జాతి పిల్లులు పెంపుడు పిల్లికి ఒక ఆఫ్రికన్‌ పిల్లికి పుట్టిన సంకర జాతి. ఇది సాధారణ పిల్లుల కంటే సుమారు 18.83 అంగుళాల పొడువు ఉంటుందని తెలిపారు.

2016లలో పెన్నిర్‌కి సంబంధించిన మరో జాతి సుమారు 19.05 అడుగుల ఎత్తుతో  రికార్డు సృష్టించినట్లు తెలిపారు. ఐతే దురదృష్టవశాత్తు ఆ జాతి మొత్తం ఒక  అగ్ని ప్రమాదం మరణించాయని తెలిపారు. అవి ఇప్పటికి చరిత్రలో అత్యంత ఎత్తైన పెంపుడు పిల్లులుగా గుర్తింపు పొందుతున్నాయని అన్నారు. అంతేగాదు ఈ సవన్నా జాతి పిల్లి తన సంతతిని పునరుద్ధరించడంలో సహాయపడుతుంతని కూడా అన్నారు. అంతేగాదు అంతర్జాతీయ క్యాట్ అసోసియేషన్ ఈ జాతిని దేశీయ జాతిగా గుర్తించిందని చెప్పారు. 

(చదవండి:  టీచర్‌ అయ్యి ఉండి ఇదేం పని... పిల్లల ముందే అలా..)

Advertisement

తప్పక చదవండి

Advertisement