కిమ్‌ ఆంక్షలు: ‘బతికిపోయాను ఉత్తర కొరియాలో పుట్టలేదు’

Russian Diplomats Returned From North Korea On Rail Trolley - Sakshi

స్వదేశం చేరుకునేందుకు రష్యన్‌ దౌత్యవేత్తల తిప్పలు

ఉత్తర కొరియా నుంచి రైల్‌ ట్రాలీని తోసుకుంటూ రష్యా వైపు ప్రయాణం

సియోల్‌: కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా దేశాలన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చాలా దేశాలు ముందు జాగ్రత్తగా చర్యగా సరిహద్దులు మూసేశాయి. కొన్నాళ్ల తర్వాత రాకపోకలకు అనుమతించాయి. కానీ ఉత్తర కొరియాలో మాత్రం నేటికి ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో విదేశాల నుంచి నార్త్‌ కొరియా వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వదేశనికి వెళ్లలేక.. అక్కడే ఉండలేక చాలా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వదేశానకి వెళ్లేందుకు రష్యన్‌ దౌత్యవేత్తలు చేసిన ప్రయత్నం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోని రష్యన్‌ విదేశాంగ శాఖ తన టెలిగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. 

వివరాలు.. రష్యన్‌ దౌత్యవేత్త మూడవ కార్యదర్శి వ్లాడిస్లావ్ సోరోకిన్, మరికొందరు తమ కుటుంబ సభ్యులతో పాటు ఉత్తర కొరియాలో చిక్కుకుపోయారు. కోవిడ్‌ వ్యాప్తికి భయపడి ఆ దేశం గతేడాది జనవరి నుంచి తన సరిహద్దులను మూసి వేసింది. దాంతో ఈ రష్యన్‌ దౌత్యవేత్తలు ఇన్నాళ్లు కొరియాలోనే ఉండి పోవాల్సి వచ్చింది. నిషేధం ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు. ఇంకా ఎంతకాలం ఇలా ఉండాల్సి వస్తుందోనని వారు ఆందోళన చెందారు. దాంతో ఉత్తర కొరియా నుంచి రష్యాకు చేరుకోవడానికి వారు ఓ అద్భుతమైన మార్గం ఎన్నుకున్నారు. ఈ మేరకు ఓ రైల్‌ ట్రాలీని సిద్దం చేసుకున్నారు. తమ లగేజ్‌, చిన్న పిల్లలు, ఆడవారిని ట్రాలీలో కూర్చో పెట్టారు. ఆ తర్వాత మరి కొందరు ఆ ట్రాలీని రైలు పట్టాలపై తోయడం ప్రారంభించారు. 

అలా దాదాపు 32 గంటల పాటు ప్రయాణం చేసి రష్యా సరిహద్దుకు చేరుకున్నారు. వీరి రాక గురించి రష్యా విదేశాంగ శాఖ అధికారులకు ముందుగానే సమాచారం ఉండటంతో.. దౌత్యవేత్తల కోసం సరిహద్దులో వాహనాలు సిద్దంగా ఉంచారు. ఆ తర్వాత ఉత్తర కొరియా నుంచి వచ్చిన దౌత్యవేత్తల బృందానికి కోవిడ్‌ టెస్ట్‌ చేసి.. దేశంలోకి అనుమతించారు. కొద్ది రోజుల పాటు బయట తిరగవద్దని తెలిపారు. అలా మరో రెండు గంటల ప్రయాణం తర్వాత ఈ దౌత్యవేత్తలు తమ ఇళ్లకు చేరుకున్నారు. దాదాపు ఏడాది తర్వాత పుట్టిన గడ్డను చేరడంతో వారి సంతోషానికి హద్దు లేకుండా పోయింది. అంతసేపు పడిన శ్రమను మర్చిపోయి.. సంతోషంగా అరుస్తూ కేకలేశారు.

ఈ సందర్భంగా వ్లాడిస్లావ్ సోరోకిన్ మాట్లాడుతూ.. ‘‘క్షేమంగా ఇంటికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మా ప్రయాణం కనిపించినంత సులువేం కాదు. చాలా ఇబ్బందిపడ్డాం. ముఖ్యంగా రష్యావైపు నడుచుకుంటూ రావడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్నది. ఏదైతేనేం క్షేమంగా ఇంటికి వచ్చాం. అది చాలు’’ అన్నారు. వీరి ప్రయాణానికి సంబంధించిన వీడియోను రష్యన్‌ విదేశాంగ శాఖ సోషల​ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు దేవుడికి ధన్యవాదాలు నేను ఉత్తర కొరియాలో జన్మించలదు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: 
ఆమె బతికే ఉంది.. ఇదిగో సాక్ష్యం
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సరిహద్దులోకి వ్యక్తి..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-04-2021
Apr 09, 2021, 18:11 IST
అంబులెన్స్‌లో ఉన్న వ్యక్తికి కరోనా. నాకు కాదు
09-04-2021
Apr 09, 2021, 12:12 IST
కోవిడ్‌ చికిత్స పేరుతో ప్రైవేట్‌ ఆస్పత్రులు దోపిడీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, మాస్క్‌ పెట్టుకోని వారి పట్ల కఠినంగా...
09-04-2021
Apr 09, 2021, 11:12 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండోదశలో కరోనా విలయం కొనసాగుతోంది.  రోజు రోజుకు  కొత్త రికార్డు స్థాయిలతో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. ...
09-04-2021
Apr 09, 2021, 10:26 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందన్న కరోనా మరోసారి పంజా విసురుతుండటంతో...
09-04-2021
Apr 09, 2021, 09:01 IST
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌(78) కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల...
09-04-2021
Apr 09, 2021, 08:24 IST
గురువారం 36 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 22 మంది బెంగళూరు వాసులే.
09-04-2021
Apr 09, 2021, 06:33 IST
న్యూఢిల్లీ/ముంబై:  కరోనా వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర సర్కారు మధ్య వివాదం ముదురుతోంది. ఇరుపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి....
09-04-2021
Apr 09, 2021, 04:35 IST
న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలను కోరారు. వైరస్‌ నియంత్రణలో...
09-04-2021
Apr 09, 2021, 04:21 IST
న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని హడలెత్తిస్తోంది. ప్రతి రోజూ ఒక కొత్త రికార్డు నమోదవుతోంది. గత 24 గంటల్లో...
09-04-2021
Apr 09, 2021, 02:18 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలను భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌...
09-04-2021
Apr 09, 2021, 01:39 IST
వెల్లింగ్టన్‌: భారత్‌ కోవిడ్‌–19 హాట్‌ స్పాట్‌గా మారుతూ ఉండడంతో న్యూజిలాండ్‌ భారత్‌ నుంచి ప్రయాణికుల రాకపోకలపై తాత్కాలికంగా నిషేధం విధించింది....
09-04-2021
Apr 09, 2021, 01:36 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కరోనా విజృంభణతో జనం వణికిపోతున్నారు. లక్షణాలు లేకుండా సోకు తుండటంతో ఎవరికి వైరస్‌ ఉందో ఎవరికి...
09-04-2021
Apr 09, 2021, 00:55 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 సోకిన ప్రతీ పది మందిలో ఒకరిపై వైరస్‌ దుష్ప్రభావాలు దీర్ఘకాలం కనిపిస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కరోనా...
08-04-2021
Apr 08, 2021, 20:49 IST
కరోనా విజృంభణ వ్యాప్తితో లాక్‌డౌన్‌ విషయమై ప్రధాని మోదీ కీలక ప్రకటన. దీనిపై ముఖ్యమంత్రులతో చర్చ
08-04-2021
Apr 08, 2021, 19:49 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 31,268 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,558 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
08-04-2021
Apr 08, 2021, 17:19 IST
మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారేమోనని భయం.. పెరుగుతున్న కేసులతో తీవ్ర ఆంక్షలు.. ఊరిబాట పట్టిన కార్మికులు
08-04-2021
Apr 08, 2021, 13:02 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో  రెండో దశలో  కరోనా కేసులు  రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.  తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా రోజువారీ...
08-04-2021
Apr 08, 2021, 11:47 IST
సాక్షి,న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా సంస్థ తమకు లీగల్‌ నోటీసు జారీ చేసిందని కరోనా వైరస్‌ టీకా ‘కోవిషీల్డ్‌’ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌...
08-04-2021
Apr 08, 2021, 11:43 IST
సాక్షి, అబిడ్స్‌(హైదరాబాద్‌): బేగంబజార్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. బేగంబజార్‌లో 100 మందికిపైగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అ‍య్యింది. దీంతో రాష్ట్రంలోనే ప్రముఖ వ్యాపార కేంద్రమైన...
08-04-2021
Apr 08, 2021, 09:09 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా గ్రేటర్‌లో మళ్లీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఒకవైపు పాజిటివ్‌ కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవుతుండగా...మరో వైపు కోవిడ్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top