పుతిన్‌ ఆంక్షలు... రష్యన్లు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి!

Putin Signed Decree Prohibiting Russians From leaving The Country - Sakshi

Putin has banned Russians from leaving country:  ఉక్రెయిన్‌ రష్యాల మధ్య పోరు నివరవధికంగా సాగుతూనే ఉంది. ప్రపంచదేశాల ఆంక్షలు, హెచ్చరికలు లక్ష్య పెట్టక తనదైన యుద్ధ వ్యూహ రచనతో ఉక్రెయిన్‌పై దాడి కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ప్రపంచదేశాలన్ని పలు ఆంక్షలతో రష్యాని​ కట్టడిచేసేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాక బ్యాంకులను దిగ్బంధం చేసి స్విఫ్ట్‌ కొరడ ఝళిపించేందుకు యత్నిస్తోంది. దీంతో ఇప్పుడు పుతిన్‌ సుమారు రూ.7 లక్షలకు పైగా విదేశీ కరెన్సీతో రష్యన్లు ఎవరు దేశం విడిచి పారిపోకుండా ఉండేలా నిషేధించారని ఉక్రెయిన్‌ స్థానిక మీడియా పేర్కొంది. అందుకు సంబంధించిన డిక్రి పై కూడా పుతిన్‌ సంతకం చేశారని తెలిపింది.

ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై అమెరికా దాని మిత్రదేశాలు, ఈయూ , ఇతర దేశాలు విధించిన ఆంక్షలను అనుసరించి పుతిన్‌ ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు యూఎస్‌ అధ్యక్షుడు జో బైడెన్‌ ఉక్రెయన్‌కు బహిరంగంగా తన మద్ధతను బలపరిచారు. రష్యాపై పోరాటంలో యూఎస్‌ ప్రమేయం లేదని చెప్పారు. అయితే తమ దేశం తన మిత్రదేశాలతో కలిసి నాటో భూభాగాలను కాపాడుతుందని చెప్పారు.

ఈ మేరకు జోబైడెన్‌ మాట్లాడుతూ...ఉక్రేనియన్లు స్వచ్ఛమైన ధైర్యంతో పోరాడుతున్నారని,రాబోయే కొద్ది రోజులు, వారాలు లేదా నెలలు వారికి కఠినంగా ఉండొచ్చు. అంతేకాదు పుతిన్ ఉక్రెయిన్‌ రాజధాని కైవ్‌ను ట్యాంకులతో చుట్టు ముట్టవచ్చునేమో కానీ ఉక్రెయిన్‌ ప్రజల మనస్సులను గెలవలేడు. ప్రపంచ దేశాల ధృఢ సంకల్పాన్ని పుతిన్‌ ఎ‍న్నటికీ బలహీనపరచలేడు అని అన్నారు.

(చదవండి: మెళ్లకు మైళ్లు నడిచి..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top