ఫోటో ఫీచర్‌: చిన్న మంచు ఫలకంపై ఎలుగుబంటి.. | Photography Awards: Polar Bear Lazing On iceberg Climate Change Wins Prize | Sakshi
Sakshi News home page

ఫోటో ఫీచర్‌: చిన్న మంచు ఫలకంపై ఎలుగుబంటి..

Oct 15 2021 11:12 AM | Updated on Oct 15 2021 11:24 AM

Photography Awards: Polar Bear Lazing On iceberg Climate Change Wins Prize - Sakshi

వెయ్యి పదాలలో చెప్పలేని భావం.. ఒక్క ఫొటోతో చెప్పవచ్చట.. ఇది కూడా అలాంటిదే.. చిన్న మంచు ఫలకంపై ఎలుగుబంటి ముడుచుకుని పడుకున్న ఈ చిత్రం.. చూడ్డానికి మామూలుగా కనిపిస్తోంది కదూ.. అయితే నిశితంగా పరిశీలిస్తే.. ప్రకృతికి మనిషి చేస్తున్న కీడును ఈ చిత్రం తెలియజెప్పుతోంది.. గ్లోబల్‌ వార్మింగ్‌ ఎఫెక్ట్‌.. దాని వల్ల మంచు ఖండాలు కరుగుతున్న తీరుకు ఇది అద్దం పడుతోంది.. అందుకే ఈ చిత్రానికి పర్యావరణంలో జంతువుల కేటగిరీలో ఇంటర్నేషనల్‌ గోల్డెన్‌ టర్టిల్‌ ప్రథమ పురస్కారం లభించింది. మరెక్‌ జకోవ్‌స్కి ఈ చిత్రాన్ని తీశారు. 

మనిషి ప్రకృతికి చేస్తున్న మరో నష్టం.. ప్లాస్టిక్‌ కాలుష్యం.. అందుకు సముద్రాలనూ మనం వదిలిపెట్టడం లేదు.. అందుకు నిదర్శనమే ఈ చిత్రం. ఇది మాల్స్‌లో ఇచ్చే ప్లాస్టిక్‌ నెట్‌. ఇప్పుడు ఈ చేపకు మృత్యుపాశంగా మారింది.. అలాంటి నెట్‌లో చిక్కుకుని బయటపడటానికి ఇబ్బందులు పడుతున్న ఈ మత్స్యం చిత్రాన్ని పాస్క్వేల్‌ వాజెల్లో అనే ఫొటోగ్రాఫర్‌ తీశారు. హ్యూమన్స్‌ అండ్‌ నేచర్‌ కేటగిరీలో ద్వితీయ బహుమతిని గెలుచుకుంది ఈ చిత్రం. 

ఒకరిది ఆకలి ఆరాటం, మరొకరిది బతుకు పోరాటం. పర్వతపు మేకపిల్లను వేటాడుతున్న తోడేలు చిత్రాన్ని తీసిన ఫొటోగ్రాఫర్‌ హయువాన్‌ టాంగ్‌. జంతువుల ప్రవర్తన కేటగిరీలోప్రథమ బహుమతిని గెలుచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement