డ్రోన్‌తో అద్భుతం; ఎనిమిదో వింతను చూడాల్సిందే

Photographer Stunning Video Of Sheep Herd Drone Camera Surprise Netigen - Sakshi

ఇజ్రాయెల్‌కు చెందిన డ్రోన్‌ ఫోటోగ్రాఫర్‌ లయర్ పటేల్ తన కెమెరాతో అద్భుతం చేశాడు. వందలాది గొర్రెల మంద ఒకేసారి కదులుతుండగా.. పై నుంచి అవి దిశను మార్చుకుంటున్న తీరును కెమెరాలో బందించాడు. ఆ వీడియోలో గొర్రెల కదలికల్ని ఫాస్ట్‌ పార్వర్డ్‌ పద్దతిలో ఒకసారి.. స్లో మోషన్‌ యాంగిల్‌లో  చూపెట్టాడు. ఒకసారి పాములా మెలికలు తిరుగుతూ కనిపించిన గొర్రెల మంద మరోసారి పక్షి ఆకారంలోకి మారడం కనువిందు చేసింది. డ్రోన్‌తో అద్భుతం చేసి చూపించిన లయర్‌ పటేల్‌ దీని వెనుక కఠోర శ్రమ దాగి ఉందంటూ చెప్పుకొచ్చాడు.

''కొన్ని నెలలుగా 1000-1700 సంఖ్య ఉన్న గొర్రెల మంద కదలికను డ్రోన్‌లో బందించేందుకు చాలా శ్రమించా. అవి ఒకచోట కుదురుగా ఉండకపోవడంతో వాటి చుట్టే ఏడు నెలల పాటు తిరగాల్సి వచ్చింది. అలా చివరికి ఒక దగ్గర ఆగి అవి ఆహారం మేస్తుండగా.. ఒకసారి స్లో మోషన్‌లో.. మరోసారి ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ పద్దతిలో చిత్రీకరించా. తీరా వీడియోను చూశాకా అంత అందంగా వస్తుందని ఊహించలేదు. ఇన్నాళ్ల నా కష్టం ఊరికే పోలేదు. '' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా లయర్‌ పటేల్‌ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటికే వేల సంఖ్యలో వ్యూస్‌ రాగా.. లయర్‌ కెమెరా పనితనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీలైతే మీరు ఒకసారి లుక్కేయండి.

చదవండి: వావ్‌ అంకుల్‌.. స్టెప్పులిరగదీశావ్‌ కదా..!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top