అత్యంత కాలుష్య దేశంగా పాక్.. నగరాల్లో మాత్రం? | Pakistan is the most polluted country in the world | Sakshi
Sakshi News home page

అత్యంత కాలుష్య దేశంగా పాక్.. నగరాల్లో మాత్రం?

Mar 25 2026 2:00 AM | Updated on Mar 25 2026 2:43 AM

Pakistan is the most polluted country in the world

2025 సంవత్సరాలనికి గానూ ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నగరాల జాబితాను ఐక్యూ ఎయిర్  విడుదల చేసింది. ఇందులో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్ నిలిచింది. అదే విధంగా అత్యంత కాలుష్య నగరంగా భారత్‌లోని లోనీ నగరం ఉన్నట్లు నివేదిక తెలిపింది.

ప్రపంచంలోని వాయి నాణ్యతపై స్విట్జర్లాండ్‌కు లోని ఐక్యూఎయిర్‌ సంస్థ నివేదిక విడుదల చేసింది. అందులో అత్యంత కాలుష్యం దేశంగా పాకిస్థాన్ నిలువగా, రెండవ స్థానంలో బంగ్లాదేశ్, మూడవ స్థానంలో కజకిస్థాన్ నిలిచింది. ఈ జాబితాలో భారత్ ఆరో స్థానంలో నిలిచినట్లు నివేదిక పేర్కొంది. మెుత్తంగా 143 దేశాల్లో  వాయు నాణ్యత పరీక్షలు నిర్వహించగా వాటిలో 130 దేశాలు WHO వాయు నాణ్యత ప్రమాణాలు చేరుకోలేక పోయాయి.

ఈ నేపథ్యంలోనే భారత్‌లోని లోనీ నగరం ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన నగరంగా నిలిచింది.  ఘజియాబాద్‌కు సమీపంలో, ఢిల్లీ సరిహద్దులో ఉండే ఈ పట్టణంలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఇక్కడ పీఎం2.5 కణాల సాంద్రత 112.5 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే 22 రెట్లు ఎక్కువ. 

అదే విధంగా రెండవ స్థానంలో చైనా హోటన్ ,3. బర్నీహత్ (మేఘాలయ) - 4. న్యూఢిల్లీ (భారత్) నిలిచాయి. మెుత్తంగా ప్రపంచంలోని టాఫ్‌ 10 కాలుష్య నగరాల్లో ఐదు భారతీయ నగరాలే ఉండడం ఆందోళన కలిగించే విషయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement