పాక్‌లో రేప్‌ చేస్తే మగతనం మటాష్‌! | Pakistan Cabinet okays laws for chemical castration of Molestation | Sakshi
Sakshi News home page

పాక్‌లో రేప్‌ చేస్తే మగతనం మటాష్‌!

Nov 28 2020 4:50 AM | Updated on Nov 28 2020 8:25 AM

Pakistan Cabinet okays laws for chemical castration of Molestation - Sakshi

ఇస్లామాబాద్‌: రేపిస్టులకు కెమికల్‌ కాస్ట్రేషన్‌ (రసాయనాల ద్వారా పుంసత్వాన్ని దెబ్బతీయడం) చేయడం, రేప్‌ల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం కోసం పాక్‌ ప్రభుత్వం రెండు కొత్త ఆర్డినెన్సులు తీసుకువచ్చింది. ఈ చట్టాలను కేబినెట్‌ మరోమారు పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంటుంది. కొత్త చట్టాల ప్రకారం అన్ని వయసుల స్త్రీలను మహిళగా నిర్వచిస్తారు.

ప్రస్తుత చట్టం ప్రకారం 15ఏళ్లలోపు స్త్రీలతో సంభోగాన్ని మాత్రమే రేప్‌గా పరిగణిస్తారు. అలాగే రేప్‌కు విధించే కెమికల్‌ కాస్ట్రేషన్‌ ప్రభావం కేసు స్వభావాన్ని అంటే తొలిసారి నేరం చేశారా లేక పదేపదే ఇలాంటి నేరాలు చేస్తున్నారా అనే విషయాన్ని బట్టి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం రేప్‌కేసులకు ప్రత్యేక కోర్టులతో పాటు యాంటీ రేప్‌ సెల్స్‌ను కూడా ఏర్పరుస్తారు. అలాగే మహిళల కన్యత్వాన్ని పరీక్షించేందుకు చేసే టూ ఫింగర్‌ టెస్ట్‌ను నిషేధిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement