గాఢాంధకారంలో క్యూబా | National blackout hits Cuba for second time in a week | Sakshi
Sakshi News home page

గాఢాంధకారంలో క్యూబా

Mar 23 2026 3:57 AM | Updated on Mar 23 2026 3:57 AM

National blackout hits Cuba for second time in a week

క్యూబాలో మరోసారి జాతీయ విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. దేశవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా ప్రజలు విద్యుత్ లేకుండా చీకటిలో మగ్గారు. వారం వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారి. ఇలా జరగడానికి అమెరికా విధించిన ఇంధన ఆంక్షలు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ నెలలో ఇప్పటికే మూడు ప్రధాన బ్లాక్‌ఔట్లు చోటు చేసుకున్నట్లు సమాచారం.  

బ్లాక్‌ఔట్‌కు నిరసనగా హవానాలో ప్రజలు గిన్నెలు, పాత్రలతో శబ్దాలు చేశారు. మోరాన్ పట్టణంలో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాన్ని దహనం చేశారు. ఈ సంక్షోభంపై క్యూబా ఎనర్జీ మంత్రి మాట్లాడుతూ.. జాతీయ విద్యుత్ వ్యవస్థ పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యింది. మొదటి ప్రాధాన్యతగా ఆసుపత్రులు, నీటి సరఫరాకు విద్యుత్ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.

ఇదిలా ఉంటే, ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కన్ను క్యూబాపై పడింది. అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్-కనెల్‌ను తొలగించాలనే ట్రంప్‌ భావిస్తున్నారు. క్యూబాను స్నేహపూర్వకంగా స్వాధీనం చేసుకుంటే గౌరవంగా ఉంటుందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.   మరోవైపు డియాజ్-కనెల్.. అమెరికా దాడులకు ఎదుర్కొనేందుకు ప్రజలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement