
శాన్ ఫ్రాన్సిస్కో: హోలీ ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన అమెరికాలోని స్పానిష్ ఫోర్క్‌లో గల ఇస్కాన్ రాధా కృష్ణ ఆలయ ప్రాంగణంలో తాజాగా బుల్లెట్ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా ఆలయానికి భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ఇస్కాన్ తెలిపిన వివరాల ప్రకారం రాత్రివేళ ఆలయంలో భక్తులు, అతిథులు ఉన్న సమయంలో ఆలయ భవనం చుట్టుపక్కల 20 నుండి 30 బుల్లెట్ కాల్పులు జరిగాయి.
శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ దాడిని ఖండిస్తూ, ఇస్కాన్‌కు సంఘీభావం తెలిపింది. అలాగే నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరింది. కాన్సులేట్ తన ‘ఎక్స్’ పోస్ట్‌లో స్పానిష్ ఫోర్క్, ఉటాలోని ఇస్కాన్ రాధా కృష్ణ ఆలయంలో జరిగిన కాల్పుల సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులపై సత్వర చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరుతున్నామని పేర్కొంది.
We strongly condemn the recent firing incident at the ISKCON Sri Sri Radha Krishna temple in Spanish Fork, Utah. The Consulate extends full support to all the devotees and the community and urges the local authorities to take prompt action to bring the perpetrators to justice.…
— India in SF (@CGISFO) July 1, 2025
ఈ ఏడాది మార్చి 9న కాలిఫోర్నియాలోని చినో హిల్స్‌లోని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బీఏపీఎస్)) హిందూ ఆలయంపై ఖలిస్తానీ గ్రూపు దాడి చేసింది. నాటి వివరాలను బీఏపీఎస్ తన అధికారిక పేజీలో వివరించింది. గత ఏడాది సెప్టెంబర్ 25 రాత్రి కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలోని స్వామి నారాయణ మందిరంపై కూడా విధ్వంసక శక్తులు దాడిచేశాయి. ఇటువంటి ఘటనలు స్థానిక హిందువులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: అరెస్టు హెచ్చరికలు.. ట్రంప్‌పై జోహ్రాన్ మమ్దానీ ఫైర్