అమెరికాలో దుమ్ము బీభత్సం | Montana crashes leave 6 dead after dust storm in USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో దుమ్ము బీభత్సం

Published Sun, Jul 17 2022 6:37 AM | Last Updated on Sun, Jul 17 2022 6:37 AM

Montana crashes leave 6 dead after dust storm in USA - Sakshi

హర్డిన్‌: అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో సంభవించిన దుమ్ము తుపాను ఆరు ప్రాణాలను బలి తీసుకుంది. గంటకు 60 మైళ్ల వేగంతో వీచిన బలమైన గాలులు, దుమ్ము తుపానులో హార్డిన్‌ సమీపంలో మోంటానా ఇంటర్‌ స్టేట్‌ హైవేపై వెళ్తున్న వాహనాలు చిక్కుకున్నాయి.

దారి కనిపించక ట్రాక్టర్‌ ట్రయిలర్లు, కార్లు తదితర 21 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనల్లో ఆరుగురు చనిపోయారని, క్షతగాత్రుల సంఖ్య తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడిందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement