
దేశంలో ప్రముఖులు, ధనవంతులు, జర్నలిస్టులు, ప్రతిపక్షనేతలు వరుసగా అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్న విషయం తెలిసిందే.
మాస్కో: రష్యాలో మరో ప్రముఖ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. ఉక్రెయిన్‌తో 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి దేశంలో ప్రముఖులు, ధనవంతులు, జర్నలిస్టులు, ప్రతిపక్షనేతలు వరుసగా అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా రష్యాలో అతిపెద్ద ఆయిల్ కంపెనీ అయిన ల్యూక్‌ఆయిల్ వైస్ ప్రెసిడెంట్ రాబర్ట్స్(53) మార్చ్ 12న ఆఫీసులోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్య చేసుకునే కొద్దిసేపటి ముందు తనకు తలనొప్పిగా ఉందని, మాత్రలు కావాలని ఆయన అడిగినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. రాబర్ట్స్‌తో కలిపి ఉక్రెయిన్‌తో యుద్ధం నాటి నుంచి ఇప్పటివరకు కేవలం ల్యూక్ ఆయిల్ కంపెనీకి చెందిన టాప్ ర్యాంకు అధికారులు నలుగురు మరణించడం గమనార్హం.