వేలంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి జాకెట్‌.. ఎంత ధర పలికిందంటే?

London: Ukraine President Zelenskyy Sold Khaki Fleece At Auction - Sakshi

లండన్‌లో జరిగిన ఛారిటీ వేలంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ధరించిన ప్రత్యేక ఖాకీ జిప్-అప్ ఉన్ని జాకెట్‌ వేలంలో 90వేల డాలర్ల ధర పలికింది. ఈ కార్యక్రమాన్ని మే 6న టేట్ మోడరన్ వద్ద ఉక్రెయిన్ రాయబార కార్యాలయం నిర్వహించింది. బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఈ జాకెట్‌ని అధిక ధరకు కొనుగోలు చేయాలని వేలంలో పాల్గొన్నవారిని కోరారు.

వేలానికి ముందు జెలెన్స్స్కీ ఈ కార్యక్రమానికి వర్చువల్ హాజరయ్యారు. కష్ట సమయాల్లో ఉక్రెయిన్‌కి అండగా ఉన్నందుకు బ్రిటన్‌కి, ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పరిణామాలను ఆయన మరింత హైలైట్ చేశారు. మరోవైపు, రష్యా ల్యాండింగ్‌ షిప్‌ను టీబీ2 డ్రోన్‌ సాయంతో స్నేక్‌ ఐలాండ్‌లో ముంచేసినట్టు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

చదవండి: Imran Khan:పీకల్లోతు కష్టాల్లో ఇమ్రాన్‌ ఖాన్‌.. ఆ వివరాలు దొరికితే ఇక జైలుకే!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top