Live Updates
ట్రంప్ బెదిరింపులకు దీటుగా బదులిచ్చిన ఇరాన్
ట్రంప్ బెదిరింపులకు దీటుగా బదులిచ్చిన ఇరాన్
తమ వద్ద 15 వేల క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ స్పష్టం చేసింది. అలానే 45 వేల డ్రోన్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపింది. మరోవైపు తమ దేశ ప్రజలను కూడా ఇరాన్ అప్రమత్తం చేసింది. ప్రజలంతా ఇంటి లోపలే ఉండాలని.. విద్యుత్ కేంద్రాలు, సైనిక కేంద్రాలకు దూరంగా ఉండాలని సూచించింది. అలానే బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండాలని ఇరాన్ ప్రభుత్వం సూచించింది.
కువైట్‌లో ప్రభుత్వ హెచ్చరికలు
పౌరులంతా బుధవారం ఉదయం 6 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని కువైట్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ క్షిపణి దాడులు జరిపే ప్రమాదం ఉండడంతో.. కువైట్ తన పౌరులను హెచ్చరించింది.
అమెరికా జర్నలిస్టుని విడుదల చేస్తాం: హిజ్బుల్లా
ఇరాన్ ప్రేరేపిత మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా తాము నిర్బంధించిన అమెరికా జర్నలిస్టు షెల్లీ కిటిల్సన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆమె ఇరాక్‌లో బందీగా ఉన్నట్లు సమాచారం.

లెబనాన్ నగరాలైన టైర్, రాస్ అల్-నకౌరా సముద్ర ప్రాంతంలో నౌకలకు ఇజ్రాయెల్ సైన్యం "తక్షణ హెచ్చరిక" జారీ చేసింది. సోషల్ నెట్ వర్క్ ఎక్స్‌లో ఒక ప్రకటనలో, ఐడీఎఫ్ ప్రతినిధి హిజ్బుల్లా ఈ ప్రాంతంలో నౌకలను ప్రమాదంలో పడేసే కార్యకలాపాలను నిర్వహిస్తోందని, చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శ్రేణి చిత్రాన్ని విడుదల చేస్తూ, దానిలో లంగరు వేసిన లేదా రవాణాలో ఉన్న నౌకలను ఉత్తరం వైపు వెళ్ళమని ఆయన సలహా ఇచ్చారు.
బహ్రెయిన్ ప్రతిపాదిత తీర్మానాన్ని వీటో చేసిన రష్యా, చైనా
- బహ్రెయిన్ ప్రతిపాదిత తీర్మానాన్ని వీటో చేసిన రష్యా, చైనా
- నేటి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య షిప్పింగ్‌ను రక్షించడానికి సమన్వయం చేయడానికి దేశాలను ప్రోత్సహించే బహ్రెయిన్ ప్రతిపాదించిన తీర్మానాన్ని రష్యా చైనా వీటో చేశాయి.
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 15 మంది సభ్యుల్లో 11 మంది అనుకూలంగా ఓటు వేయగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు, రెండు గైర్హాజరు
ఇరాన్‌లోని భారతీయులకు ఎంబసీ సూచనలు
- రాబోయే 48 గంటల పాటు మీరు ఉన్నచోటనే ఉండండి
- బహుళ అంతస్తుల భవనాలకు దూరంగా ఉండండి
- ఇరాన్‌లో భారత రాయబార కార్యాలయం సూచన
ఇరాన్ స్పందన కోసం ఎదురుచూస్తున్నాం: జేడీవాన్స్
- అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల వరకూ చూస్తాం
- తర్వాత పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి
- ట్రంప్ వార్నింగ్ నేపథ్యంలో ఇరాన్ హెచ్చరించిన జేడీవాన్స్
అమెరికాతో చర్చలు నిలిపివేసిన ఇరాన్
- ట్రంప్ వార్నింగ్ నేపథ్యంలో ఇరాన్ కీలక చర్యలు
- అమెరికాతో చర్చలు నిలిపివేసిన ఇరాన్
- యుద్ధంలో కొత్తదశ మెుదలైందంటూ ఇరాన్ కౌంటర్
కోటి 40 లక్షల మంది ప్రాణత్యాగానికి సిద్ధం
- కోటి 40 లక్షల మంది ప్రాణత్యాగానికి సిద్ధం
- దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి ముందుకొచ్చారని ప్రకటన
- వివరాలు ప్రకటించిన ఇరాన్ ప్రెసిడెంట్ పెజేష్కియన్
ప్రపంచంలో ఎక్కడైనా మేము దాడులు చేయగలం: ఇరాన్
- ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు: ఇరాన్
- ప్రపంచంలో మేము ఎక్కడైనా దాడులు చేయగలం
- దేశం కోసం మేం దేనికైనా సిద్ధం
ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు డెడ్లీ వార్నింగ్
- ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమవుతుంది
- అది జరగొద్దని అనుకుంటున్నా. కానీ జరుగుతోంది
- ఆ నాగరికతను తిరిగి వెనక్కి తీసుకురావడం అసాధ్యం
- ఇరాన్‌లో ఇప్పుడు పాలన మారి అద్భుతం జరుతుందని అనుకుంటున్నా
- ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం
- 47 ఏళ్ల దోపిడీ,అవినీతి అంతమవుతుంది
సరిహద్దులకు మీ పిల్లల్ని పంపండి: ఇరాన్
- దేశం కోసం యుద్ధానికి మీ పిల్లల్ని పంపండి: ఇరాన్
- తల్లిదండ్రులు తమ పిల్లలను సరిహద్దులకు పంపాలని ఇరాన్ విజ్ఞప్తి
అమెరికా దాడులు షూరూ
- డెడ్‌లైన్‌కు ముందే అమెరికా వైమానికి దాడులు
- ఖర్గ్ ద్వీపంపై దాడి జరిగినట్లు ఇరాన్ మీడియా వెల్లడి
- ఇరాన్ ఎనర్జీ హబ్ ఖర్గ్ ఐల్యాండ్ వద్ద భారీ పేలుళ్లు
- ఇజ్రాయెల్ దాడుల్లో రైల్వే బ్రిడ్జి ధ్వంసం
ఇరాన్ పౌరులకు ఇజ్రాయెల్ సూచనలు
రైలు ప్రయాణాలకు దూరంగా ఉండండి
స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 9 గంటల వరకు రైళ్లు ఎక్కొద్దు
లేదంటే "మీ ప్రాణాలకు ముప్పు" అని ఇజ్రాయెల్ హెచ్చరిక
ఇజ్రాయెల్ కొత్త దాడులకు ప్రణాళిక వేస్తోందని సూచనలు
నేటితో ముగుస్తున్న ట్రంప్ డెడ్‌లైన్
సమాచారం లీక్.. కచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు:ట్రంప్
- ఇరాన్‌ను పూర్తిగా అధీనంలోకి తీసుకుంటాం-ట్రంప్
- ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా కొనసాగుతోంది
- శత్రు ప్రాంతాల్లోకి ఎఫ్-15 దూసుకెళ్లింది-ట్రంప్
- ఏ దేశానికి లేనన్ని ఆయుధాలు అమెరికాకు ఉన్నాయి
- రెస్క్యూ ఆపరేషన్ గురించి ఇరాన్‌కు ముందే తెలిసింది
- సమాచారం లీక్ చేసిన వ్యక్తి కచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు-ట్రంప్
మానవ హారాలే విద్యుత్ ప్లాంట్లకు కవచాలుగా..
అమెరికా దాడులు చేయాలనుకుంటున్న ప్రాంతాల వద్దకు యువత?
మానవ హారాలను ఏర్పాటు చేయాలని యువతకు ఇరాన్ పిలుపు
ఇరాన్ ప్లాంట్లు, బ్రిడ్జిల వద్ద మానవ కవచాలు ఏర్పాటు?
ముగుస్తున్న ట్రంప్ డెడ్‌లైన్.. జాగ్రత్త పడుతున్న ఇరాన్
అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు ఇరాన్ సిద్ధం!
దాడుల తీవ్రతను పెంచేందుకు అమెరికా-ఇజ్రాయెల్ సిద్ధం?
విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్‌లు పేల్చేస్తామని ఇప్పటికే ట్రంప్ వార్నింగ్
ఇరాన్‌ను పూర్తిగా అధీనంలోకి తీసుకుంటామన్న ట్రంప్
కాల్పుల విరమణ ప్రతిపాదనలకు ఒప్పుకోని ఇరాన్
అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు ఇరాన్ సిద్ధం!
మార్కెట్లు, మాల్స్ రాత్రి 8 గంటలకే మూసివేత
పాకిస్థాన్‌పై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం
మార్కెట్లు, మాల్స్ అన్నింటినీ రాత్రి 8 గంటలకే క్లోజ్
నేటి నుంచి మూసివేయించాలని ప్రభుత్వం నిర్ణయం
ఇంధన ఖర్చులకు ప్రతిస్పందనగా పొదుపు చర్యలు
మెడికల్ స్టోర్లు, ఫార్మసీలకు మినహాయింపు
జిన్‌పింగ్ ముందు జాగ్రత్త
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న ఇరాన్ యుద్ధం
కొత్త ఎనర్జీ సిస్టమ్ కోసం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపు
చైనా ఎనర్జీ సెక్యూరిటీ కోసం కొత్త ఎనర్జీ సిస్టమ్ ప్రణాళిక వేయాలి
ఆ తర్వాత నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా చేయాలి
అణు విద్యుత్‌ను భద్రంగా, క్రమబద్ధంగా విస్తరించాలి: జిన్‌పింగ్


