Afghanistan: తీవ్ర పరిణామాలు, అమెరికాకు తాలిబన్ల వార్నింగ్‌!

Leave Afghanistan by August 31 or face serious consequences - Sakshi

అమెరికాకు తాలిబన్ల డెడ్‌లైన్‌

ఈనెల 31లోగా సైనికులను ఉపసంహరించుకోవాలని వార్నింగ్

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అమెరికాకు తాజా హెచ్చరికలు జారీ చేశారు. అగస్టు 31లోగా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ డెడ్‌లైన్‌ విధించారు.  ఈ మేరకు తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ సోమవారం ఒక ప్రకటన  విడుదల చేశారు.

ఆగస్టు 31 లోపు కాబూల్ విమానాశ్రయం నుండి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని తాలిబన్లు అమెరికాకు వార్నింగ్‌ ఇచ్చారు. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సైనిక బలగాల ఉపసంహరణ గడువును మరింత పెంచే యోచనలో ఉన్నట్టు బైడెన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోగా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చి చెప్పారు.

 మిత్రదేశాలకూ వార్నింగ్‌
అలాగే అమెరికాతోపాటు మిత్ర దేశాలకు కూడా ఇదే తరహా హెచ్చరిక జారీ చేశారు. వారంలోగా అన్ని దేశాల సైనికులు అఫ్గాన్‌ విడిచి వెళ్లాలని స్పష్టం చేశారుర. లేదంటే వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అన్ని దేశాల సైనికులు వెళ్లాకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు. మరోవైపు దేశం విడిచివెళ్లేందుకు వేలాదిగా ప్రజలు కాబూల్‌ విమానాశ్రయానికి తరలివస్తున్నారు. ఈ సందర్బంగా తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు తలెత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరూ దేశం విడిచి వెళ్లవద్దని తాలిబన్లు ప్రజలకు విజప్తి చేస్తున్నారు. 

చదవండి : Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది!
Afghanistan: ఆమె భయపడినంతా అయింది!
అఫ్గనిస్తాన్‌లో తాలిబన్‌ రాజ్యం.. క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు: నటి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top