breaking news
serious consequences
-
నవ భారత్ బెదరదు!
ధార్: అణ్వాయుధాలను బూచిగా చూపించి భారత్‌ను బెదిరిస్తామంటే ఎంతమాత్రం కుదరదని పాకిస్తాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా పాకిస్తాన్‌కు తేల్చిచెప్పారు. అణ్వ్రస్తాలకు నవ భారతదేశం(న్యూ ఇండియా) భయపడదని స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కోలుకోలేని నష్టం జరిగిందని తెలిపారు. నష్టం జరిగినట్లు జైషే మొహమ్మద్ కమాండర్ స్వయంగా అంగీకరించాడని గుర్తుచేశారు. 75వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ బుధవారం మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పర్యటించారు. పలు సేవా కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలకు శ్రీకారం చుట్టారు. భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారంటే... మన సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది ‘‘పాకిస్తాన్ ఉగ్రవాదులు మన అక్కచెల్లెమ్మలు, కుమార్తెల సిందూరం తుడిచేశారు. ముష్కరులకు బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాం. వారి స్థావరాలను ధ్వంసం చేశాం. అపూర్వమైన ధైర్య సాహసాలు కలిగిన మన సైనిక దళాలు కేవలం రెప్పపాటు కాలంలో పాకిస్తాన్‌ను మోకాళ్లపై నిల్చోబెట్టాయి. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్ ఉగ్రవాద ముఠా నాయకులకు జరిగిన నష్టాన్ని నిన్ననే ఓ ముష్కరుడు రోదిస్తూ బయటపెట్టడం ప్రపంచమంతా చూసింది. ఇది నవ భారత్. అణు బాంబులతో మనల్ని ఎవరూ భయపెట్టలేరు. ఉగ్రవాదుల ఇళ్లలోకి ప్రవేశించి మరీ వారిని మట్టుబెట్టగలం. మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది. మన మంత్రం స్వదేశీ ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేసి, ఉపయోగించుకోవాలని మరోసారి కోరుతున్నా. పండుగల సీజన్ రాబోతోంది. స్వదేశీ ఉత్పత్తుల వాడకం పెంచుకోవాలి. మీరు కొనేది, విక్రయించేది ఏదైనా సరే అది ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తి కావాలి. స్వాతంత్య్రం సాధించడానికి జాతిపిత మహాత్మా గాంధీ స్వదేశీని ఒక ఆయుధంగా ప్రయోగించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’కు స్వదేశీ ఉత్పత్తుల వాడకమే పునాది అని మర్చిపోవద్దు. మన దేశంలో తయారైన వస్తువులు, సరుకులు ఉపయోగిస్తేనే దేశానికి లబ్ధి చేకూరుతుంది. ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. ప్రజలు స్వదేశీ ఉద్యమంలో పాలుపంచుకోవాలి. మన ఉత్పత్తుల పట్ల మనం గరి్వంచాలి. అది చిన్న వస్తువైనా, పెద్ద వస్తువైనా మన దేశంలో తయారైన వస్తువునే కొనండి. పిల్లల బొమ్మలు, దీపావళి విగ్రహాలు, ఇంట్లో అలంకరణ సామగ్రి, మొబైల్ ఫోన్లు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు మన దగ్గర తయారవుతున్నాయి. వాటిని ఉపయోగించుకోండి. ఏదైనా కొనుగోలు చేసే ముందు అది ‘మేడ్ ఇన్ ఇండియా’ అవునో కాదో తనిఖీ చేసుకోండి. స్వదేశీ ఉత్పత్తులు కొంటే మన డబ్బు మన దేశంలోనే ఉంటుంది. అది నేరుగా దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ సొమ్ముతో రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించవచ్చు. పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు. స్వదేశీ వస్తువుల విక్రయాలు పెరిగితే కంపెనీల్లో వాటి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. తద్వారా మన దగ్గర ఎంతోమందికి ఉద్యోగాలు లభిస్తాయి. తగ్గించిన జీఎస్టీ రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. స్వదేశీ వస్తువులు కొని ఈ రేట్ల తగ్గింపు ప్రయోజనం పొందండి. విక్రయదారులు తమ దుకాణాల వల్ల ‘స్వదేశీ’ బోర్డులు గర్వంగా ఏర్పాటు చేసుకోండి. కోటికి చేరిన సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డులు ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కు నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. దీనివల్ల దేశంలో వస్త్ర పరిశ్రమకు నూతన బలం చేకూరుతుంది. యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు. అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఔషధాలు సైతం ఉచితంగా అందజేస్తారు. ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అవగాహన, వనరులు లేవన్న కారణంతో మహిళలు నష్టపోవడానికి వీల్లేదు. అందుకే ఈ కార్యక్రమం ప్రారంభించాం. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా వ్యాధిని అరికట్టడానికి 2023లో నేషనల్ మిషన్‌ను మధ్యప్రదేశ్‌లోనే ప్రారంభించాం. అప్పట్లో మొట్టమొదటి సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డు అందజేశాం. ఈరోజు కార్డుల సంఖ్య కోటికి చేరింది. దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికిపైగా ప్రజలు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలితాలు కళ్లముందే కనిపిస్తున్నాయి. దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు’’ అని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. పీఎం మిత్రా పార్కు దేశంలో మొట్టమొదటి ‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైట్ రీజియన్, అప్పారెల్(పీఎం మిత్రా)’ పార్కు నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే స్వాస్థ్ నారీ సశక్త్ పరివార్‌ను, రాష్ట్రీయ పోషణ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఎం మిత్రా పార్కులో భాగంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ప్రపంచ స్థాయి టెక్స్టైల్ తయారీ కేంద్రాలను స్థాపించబోతున్నారు. రాష్ట్రీయ పోషణ్ కార్యక్రమం కింద శిశు సంరక్షణ, విద్యతోపాటు స్థానికంగా లభించే పౌష్టికాహారాన్ని ప్రోత్సహిస్తారు. చక్కెర, వంటనూనెల వినియోగం తగ్గించుకోవాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తారు. సుమన్ సఖి చాట్‌బాట్‌ను సైతం మోదీ ప్రారంభించారు. తల్లి, శిశువుల ఆరోగ్యంపై అవగాహన పెంచబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు తగిన సమాచారం అందజేస్తారు. తన జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ స్వయం సహాయక సంఘం సభ్యురాలికి ఒక మొక్కను బహూకరించారు. -
దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు
న్యూఢిల్లీ: భారత్‌ను హెచ్చరిస్తూ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేస్తూ దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని పాకిస్తాన్‌ను గురువారం భారత్ హెచ్చరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఒక ప్రకటన విడుదలచేశారు. ‘‘భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ నేతలు తరచూ పూర్తి నిర్లక్ష్యపూరిత, యుద్దోన్మాద, విద్వేషపూరిత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పాకిస్తాన్ తన గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేంకు భారత వ్యతిరేక వాణిని తరచూ వినిపిస్తోంది. మరోసారి ఏదైనా కవ్వింపు చర్యలతో దుస్సాహసానికి తెగిస్తే తీవ్రమైన పర్యావసా నాలను చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్‌తో భారత్ తన సత్తాను మీకు రుచి చూపించింది’’ అని జైశ్వాల్ అన్నారు. ఇటీవల అమెరికాలో పర్యటించినవేళ ట్రంప్ భేటీ సమయంలో భారత్‌నుద్దేశిస్తూ మునీర్ హెచ్చరిక వ్యాఖ్యలు చేయడం తెల్సిందే. ‘‘ భారత్ కారణంగా పాకిస్తాన్ ఉనికి ప్రశ్నార్థకంగా మారితే అణుబాంబు ప్రయోగానికికైనా సిద్ధం. మా దేశం ఇబ్బందుల్లో పడితే సగం ప్రపంచాన్ని మాతోపాటు సమస్యల సుడిగుండంలోకి తీసుకెళ్తాం’’ అని వ్యాఖ్యానించారు. మునీర్ వ్యాఖ్యలపై ఆనాడే భారత్ ఘాటుగా బదులిచ్చింది. ‘‘ అణు బెదిరింపులకు భయపడేది లేదు. పాతకాలంనాటి అణుబెదిరింపులు ఆపితే మంచిది. అణ్వాయుధాలు ప్రయోగిస్తామనడం పూర్తి బాధ్యతారాహిత్యం. సైన్యం కనుసన్నల్లో పాలన వెళగబెట్టే పాక్ లాంటి దేశం నుంచి ఇలాంటి అణుబెదిరింపులు రావడం అంతర్జాతీయ సమాజానికి అత్యంత ప్రమాదకరం’’ అని భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. -
అమెరికాకు డెడ్‌లైన్ విధించిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అమెరికాకు తాజా హెచ్చరికలు జారీ చేశారు. అగస్టు 31లోగా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ డెడ్‌లైన్ విధించారు. ఈ మేరకు తాలిబన్ ప్రతినిధి సుహైల్ షహీన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 31 లోపు కాబూల్ విమానాశ్రయం నుండి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని తాలిబన్లు అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సైనిక బలగాల ఉపసంహరణ గడువును మరింత పెంచే యోచనలో ఉన్నట్టు బైడెన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోగా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చి చెప్పారు. మిత్రదేశాలకూ వార్నింగ్ అలాగే అమెరికాతోపాటు మిత్ర దేశాలకు కూడా ఇదే తరహా హెచ్చరిక జారీ చేశారు. వారంలోగా అన్ని దేశాల సైనికులు అఫ్గాన్ విడిచి వెళ్లాలని స్పష్టం చేశారుర. లేదంటే వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అన్ని దేశాల సైనికులు వెళ్లాకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు. మరోవైపు దేశం విడిచివెళ్లేందుకు వేలాదిగా ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి తరలివస్తున్నారు. ఈ సందర్బంగా తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు తలెత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరూ దేశం విడిచి వెళ్లవద్దని తాలిబన్లు ప్రజలకు విజప్తి చేస్తున్నారు. చదవండి : Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది! Afghanistan: ఆమె భయపడినంతా అయింది! అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ రాజ్యం.. క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు: నటి -
డీఎంకేలో చేర్చుకోకుంటే ఖబడ్దార్: అళగిరి
మదురై: డీఎంకేలోకి తనను మళ్లీ చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తన సోదరుడు, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను బహిష్కృత నేత అళగిరి హెచ్చరించారు. మంగళవారం డీఎంకే అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరగనున్న డీఎంకే సర్వసభ్య సమావేశంలో స్టాలిన్ ఎన్నిక లాంఛనమే కానుంది. పార్టీలోకి తనను చేర్చుకోకుంటే సెప్టెంబర్ 5న చెన్నైలో తలపెట్టిన ర్యాలీలో తన సత్తా ఏంటో చూపిస్తానని అళగిరి అన్నారు. కరుణానిధికి నివాళులర్పించేందుకు నిర్వహిస్తోన్న ఈ ర్యాలీకి పార్టీ కార్యకర్తలు తన నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. కరుణానిధి మరణం తర్వాత పార్టీని కాపాడటానికే తాను ఇవన్ని చేస్తున్నానని విలేకరులతో చెప్పారు. -
చైనా-భారత్‌ల మధ్య జర్నలిస్ట్‌ల వివాదం
-
నల్లధనంతో...తీవ్ర పరిణామాలు తప్పవు
♦ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ హెచ్చరిక ♦ ప్రస్తుత పథకాన్ని వినియోగించాలని సూచన న్యూఢిల్లీ: నల్లధనం దాచిపెట్టుకునేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని ఆర్థికమంత్రి గురువారం అరుణ్‌జైట్లీ హెచ్చరించారు. నల్లధనం వెల్లడి, 45 శాతం పన్ను చెల్లింపు, ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపుకు సంబంధించి సెప్టెంబర్ వరకూ అమలు జరిగే ప్రస్తుత పథకాన్ని ఉపయోగించుకోవాలనీ ఆయన సూచించారు. ఇప్పటికీ తన విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించని వారు తొందరపడాలని పేర్కొన్నారు. నల్లధనం నిరోధం ఇప్పుడు కేవలం భారత్‌కు సంబంధించిన అంశమే కాదనీ, జీ-20, యూఎస్ డొమేస్టిక్ లా వంటి చొరవలతో అంతర్జాతీయంగా ఈ సమస్య పరిష్కారానికి కృషి జరుగుతోందని ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జైట్లీ పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం మొదలయిన తర్వాత విదేశాల్లో రహస్య ఆస్తులను కనిపెట్టడం కూడా పెద్ద కష్టం కాబోదని జైట్లీ ఈ సందర్భంగా అన్నారు. బస్సు పోగొట్టుకోవద్దు... ప్రస్తుత పథకాన్ని జైట్లీ ఉదహరిస్తూ, ‘ ప్రస్తుత బస్సు పోగొట్టుకుంటే, చాలా పోగొట్టుకుంటారు’ అని హెచ్చరించారు. పన్ను ఎగవేతలను సహించేది లేదని, ప్రస్తుత ఆదాయపు పన్ను శాఖ సాంకేతిక అభివృద్ధి తప్పు చేస్తున్నవారు ఎక్కడ ఉన్నా పట్టిస్తుందని తెలిపారు. వస్తు, సేవల పన్ను విధానం అమలు పన్ను ఎగవేతల దిశలో మరో కీలక అడుగవుతుందని అన్నారు. రానున్న నాలుగు సంవత్సరాల్లో ప్రస్తుత 30 శాతం కార్పొరేట్ పన్నును 25 శాతానికి కేంద్రం తగ్గిస్తుందని, ఇది ప్రపంచస్థాయి పోటీపూర్వక పరిస్థితికి అవసరమని అన్నారు. కాగా నల్లధనం వెల్లడి పథకం మరోసారి ఉండబోదని రెవెన్యూ కార్యదర్శి హాస్ముఖ్ ఆదియా ఈ సందర్భంగా పేర్కొన్నారు.