కరోనాపై కథనాలు.. ఐదేళ్ల జైలు

Journalist Get 10 Years Jail For Corona Reporting - Sakshi

బీజింగ్‌ : కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి తెలియజేసిన విలేకరికి ఐదేళ్ల జైలుశిక్షను బహుమానంగా ఇచ్చింది చైనా ప్రభుత్వం. ఝాంగ్‌ ఝాన్‌ అనే 37 ఏళ్ల మాజీ న్యాయవాది.. సిటిజన్‌ జర్నలిస్ట్‌. ఈ ఏడాది ఫిబ్రవరిలో వూహాన్‌కు వెళ్లి అక్కడి నుంచి వైరస్‌ కేసులకు సంబంధించి పలు కథనాలు రాసి, ప్రచురించింది. కరోనా వైరస్‌ మరణాలకు కారణమెవరని ప్రశ్నించిన పలు కుటుంబాలను పోలీసులు వేధించారని, కొంతమంది స్వతంత్ర విలేకరులను కనిపించకుండా చేశారని ఝాన్‌ కథనాలు రాశారని చైనీస్‌ హ్యూమన్‌ రైట్‌ డిఫెండర్స్‌ (సీహెచ్‌ఆర్‌డీ) అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఈ క్రమంలో కొట్లాటకు దిగుతున్నారని, సమస్యలు సృష్టిస్తున్నారన్న ఆరోపణలపై ఝాన్‌ను మేలో అరెస్ట్‌ చేశారు.

నెలలుగా అజ్ఞాతంలో..
ఝాంగ్‌ ఝాన్‌ మే 14 నుంచి కనిపించకుండా పోయిందని సీహెచ్‌ఆర్‌డీ తెలిపింది. ఒకరోజు తరువాత ఝాన్‌ తమ కస్టడీలో ఉన్నట్లు వూహాన్‌కు సుమారు 640 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాంఘై పోలీసులు ప్రకటించారు. జూన్‌ 19న ఝాన్‌ను అరెస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించగా మూడు నెలల నిర్బంధం తరువాత ఝాన్‌ను కలిసేందుకు న్యాయవాదికి అనుమతి లభించింది. ఝాన్‌ తన అరెస్ట్‌ను నిరసిస్తూ జైల్లోనే నిరాహార దీక్షకు దిగారని, సెప్టెంబర్‌ 18న ఆమెను దోషిగా నిర్ధారించామని ఝాన్‌ న్యాయవాదికి ఓ ఫోన్‌ వచ్చింది. కొన్ని రోజుల క్రితం ఝాన్‌ కేసులో వెలువడిన తీర్పు ప్రతిని పరిశీలించగా అందులో ‘‘వీ చాట్, ట్విట్టర్, యూట్యూబ్‌ వంటి మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని అక్షరాలు, వీడియోలు, ఇతర రూపాల్లో ప్రసారం చేశారు’’అన్న ఆరోపణలపై ఝాన్‌కు శిక్ష విధించినట్లు ఉంది.

అంతేకాకుండా.. విదేశీ ప్రచురణ సంస్థల ఇంటర్వూ్యలకు అంగీకరించినందుకు, వూహాన్‌లో వైరస్‌కు సంబంధించి దురుద్దేశపూర్వక సమాచారాన్ని ప్రచారం చేస్తున్నందుకు ఝాన్‌ను శిక్షిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నేరాలన్నింటికీ కలిపి ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధించాలని న్యాయస్థానం సూచించింది. కాగా, ఝాన్‌తోపాటు కనీసం ముగ్గురు జర్నలిస్టులు ఫిబ్రవరి నుంచి కనిపించకుండాపోయారు. వీరిలో లీ జెహూవా అనే విలేకరి ఏప్రిల్‌లో మళ్లీ ప్రత్యక్షమై.. అప్పటివరకు తాను క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పగా.. చెన్‌ కియుషీ తాను ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పుకున్నారు. ఫాంగ్‌ బిన్‌ అనే ఇంకో విలేకరి ఇప్పటివరకు అయిపు అజా లేకపోవడ గమనార్హం. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-05-2021
May 09, 2021, 06:22 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. శనివారం...
09-05-2021
May 09, 2021, 05:37 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ కొరత లేకుండా విదేశాల నుంచి లిక్విడ్‌ ఆక్సిజన్‌ కొనుగోలు చేస్తున్నామని వైద్య...
09-05-2021
May 09, 2021, 05:24 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణ, చికిత్సలో కార్పొరేట్‌ సంస్థలను భాగస్వాములను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి....
09-05-2021
May 09, 2021, 05:03 IST
సోమశిల: కరోనా బారిన పడి ఓ మహిళ మృతి చెందడంతో కుటుంబసభ్యులు భయపడి అంతిమ సంస్కారాలు చేయడానికి ముందుకు రాలేదు....
09-05-2021
May 09, 2021, 05:01 IST
అహ్మదాబాద్‌: భారత్‌లో తమ కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ ‘జైకోవ్‌–డీ’అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ ప్రముఖ ఫార్మా కంపెనీ జైడస్‌ క్యాడిలా...
09-05-2021
May 09, 2021, 04:44 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల విజృంభణ, ఆక్సిజన్‌ కొరత నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆక్సిజన్‌ పంపిణీని...
09-05-2021
May 09, 2021, 04:41 IST
జగ్గయ్యపేట అర్బన్‌: కరోనా వచ్చిందని 65 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి యజమాని అమానుషంగా నడిరోడ్డు మీదకు నెట్టేసిన ఘటన కృష్ణా...
09-05-2021
May 09, 2021, 04:37 IST
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌–19 బాధితులకు చికిత్స అందించే విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం...
09-05-2021
May 09, 2021, 04:29 IST
న్యూఢిల్లీ: భారత హాకీలో విషాదం. కరోనా కారణంగా శనివారం ఒకే రోజు ఇద్దరు మాజీ స్టార్‌ క్రీడాకారులు తుది శ్వాస...
09-05-2021
May 09, 2021, 04:16 IST
తిరుపతి తుడా: కరోనా సెకండ్‌ వేవ్‌ను దీటుగా ఎదుర్కొంటున్నామని.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్‌ సమస్య లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని...
09-05-2021
May 09, 2021, 04:09 IST
ముంబై: ఐపీఎల్‌ టి20 టోర్నీ వాయిదా పడిన తర్వాత మరో ఇద్దరు క్రికెటర్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ ఇద్దరూ...
09-05-2021
May 09, 2021, 03:59 IST
ముంబై: సుమారు మూడున్నర నెలల సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత క్రికెట్‌ జట్టు జూన్‌ 2న బయలుదేరనుంది. దానికి...
09-05-2021
May 09, 2021, 03:35 IST
కడుపులో దాచుకుంటుంది. కనురెప్పలా కాచుకుంటుంది. కష్టాన్ని ఓర్చుకోవడం నేర్పుతుంది. పోరాడే శక్తిని ఇస్తుంది. చీకట్లను సంహరించే వెలుగు ఖడ్గాన్ని చేతికి...
09-05-2021
May 09, 2021, 02:41 IST
1. పై ఫొటోలో ఆకుపచ్చ రంగువి ఆరోగ్యకరమైన కణాలు, ఎరుపురంగు చుక్కలు కరోనా వైరస్, నారింజ రంగులో మసకగా ఉన్నవి వైరస్‌ సోకి...
09-05-2021
May 09, 2021, 01:57 IST
సాక్షి, ముంబై: బ్రేక్‌ ద చైన్‌లో భాగంగా గత నెల 14వ తేదీన అమలు చేసిన లాక్‌డౌన్‌ గడువు ఈ...
09-05-2021
May 09, 2021, 00:56 IST
సాక్షి, న్యూఢిల్లీ: వారం రోజులుగా దేశవ్యాప్తంగా 180 జిల్లాలు, 14 రోజులలో 18 జిల్లాలు, 21 రోజులుగా 54 జిల్లాలు,...
08-05-2021
May 08, 2021, 23:13 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఘాటుగా స్పందించింది. కరోనా సెకండ్...
08-05-2021
May 08, 2021, 21:53 IST
ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ బాబా సెహగల్‌ కరోనాపై అవగాహన కల్పిస్తూ పాడిన పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.....
08-05-2021
May 08, 2021, 20:46 IST
జైపూర్‌: ​కోవిడ్‌తో మరణించిన వ్యక్తి అంతిమయాత్రకు హాజరైనా వారిలో 21 మంది మృతి చెందారు. ఈ సంఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని శిఖర్‌ జిల్లాలోని...
08-05-2021
May 08, 2021, 20:25 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరీ లేఖ రాశారు. మెడికల్‌ ఆక్సిజన్‌, రెమిడెసివిర్‌పై...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top