పశ్చిమాసియా యుద్ధం కొలిక్కివస్తుందనే తరుణంలో మరోసారి సమస్యలు తీవ్రతరమైతున్నట్లు కనిపిస్తున్నాయి. నిన్న(బుధవారం) అమెరికాకు చెందిన ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. కాగా ప్రస్తుతం టెహ్రాన్‌కు చెందిన ఓ ద్వీపాన్ని శత్రుదేశం ఆక్రమించే యత్నం చేస్తుందని ఆ దేశ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబాఫ్ హెచ్చరించారు.
ఎక్స్ వేదికగా ఆయన మాట్లాడుతూ "ఇంటిలిజెన్స్ నివేదికల ప్రకారం ఇరాన్ శత్రువులు ఒక ప్రాంతీయ దేశం మద్దతుతో ఇరాన్ దీవులలో ఒకదానిని ఆక్రమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మా బలగాలు శత్రువుల కదలికలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నాయి. వారు ఏ మాత్రం ముందడుగు వేసినా శత్రువుకు సహాయం చేసిన ప్రాంతీయ దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలన్నింటినీ ఏ మాత్రం కనీకరం లేకుండా ధ్వసం చేస్తాం. నిరంతరం దాడులు చేస్తాం" అని హెచ్చరించారు.
కాగా ప్రస్తుతం ట్రంప్ వేలాది మంది వైమానిక దళాలను మరియు అదనపు మెరైన్‌లను గల్ఫ్‌కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కంబాట్ వార్‌కు తెరదించనున్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే ఇదివరకే ట్రంప్ ఇరాన్ ముడిచమురు ఎగుమతుల్లో ప్రధానమైన ఖర్గ్ ద్వీపాన్ని "పూర్తిగా రక్షణ లేకుండా అక్కడ ఉన్న ఒక చిన్న చమురు ద్వీపం" అని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


