గర్వంగా ఉంది: ఇరాన్‌ కీలక ప్రకటన | Sakshi
Sakshi News home page

గర్వంగా ఉంది: ఇరాన్‌ కీలక ప్రకటన

Published Sat, Apr 17 2021 10:22 AM

Iran Says They Enriched Raw Uranium With 60 Percent Purity - Sakshi

దుబాయ్‌: యురేనియం ముడిపదార్థం నుంచి 60 శాతం స్వచ్ఛమైన యురేనియాన్ని వేరు చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఆ దేశ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఘర్‌ ఖలిబాఫ్‌ ఓ ట్వీట్‌ చేశారు. అందులో.. ‘మా యువ శాస్త్రవేత్తలు యురేనియం ముడి పదార్థం నుంచి 60 శాతం స్వచ్ఛమైన యురేనియాన్ని వేరు చేశారు. ఈ ప్రకటన చేయడం పట్ల ఎంతో గర్వంగా ఉంది. ఈ ఘనత సాధించిన ఇస్లామిక్‌ ఇరాన్‌కు నా అభినందనలు. . ఇరాన్‌కున్న పట్టుదల అద్భుతమైనది, కుట్రలను నాశనం చేయగలది’ అని పేర్కొన్నారు. స్వచ్ఛమైన యురేనియాన్ని అణ్వాయుధాల తయారీలో ఉపయోగిస్తారు. ఇటీవల ఇరాన్‌లోని నటాన్జ్‌ న్యూక్లియర్‌ స్థలంపై దాడి జరగడంతో, దానికి ప్రతిగా ఇరాన్‌ ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. 

చదవండి: అమెరికా సంచలన ప్రకటన: అఫ్గాన్‌ నుంచి బలగాలు వెనక్కి

Advertisement
Advertisement