భారత్‌ కోసం హార్మూజ్‌ తెరుస్తాం: ఇరాన్‌ సంచలన ప్రకటన | Iran says Hormuz opens For India And friendly nations | Sakshi
Sakshi News home page

భారత్‌ కోసం హార్మూజ్‌ తెరుస్తాం: ఇరాన్‌ సంచలన ప్రకటన

Mar 26 2026 8:19 AM | Updated on Mar 26 2026 8:35 AM

Iran says Hormuz opens For India And friendly nations

టెహ్రాన్‌: ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్‌ సంచలన ప్రకటన చేసింది. హార్మూజ్‌ విషయంలో భారత్‌, మరో నాలుగు దేశాలకు ఇరాన్‌ భారీ ఊరటను ఇచ్చింది. ఈ ఐదు దేశాల కోసం హార్మూజ్‌ జలసంధిని ఓపెన్‌ చేస్తున్నట్టు తాజాగా ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్‌ అరాఘి చెప్పుకొచ్చారు. దీంతో, ఆయా దేశాలకు చమురు ఇబ్బందులు తొలిగిపోయే అవకాశం ఉంది. 

ఈ సందర్బంగా ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్‌ మాట్లాడుతూ..‘హార్మూజ్‌ జలసంధిలో భారత్‌తో సహా ఐదు మిత్ర దేశాలకు చెందిన నౌకలపై ఎటువంటి ఆంక్షలు విధించబోమని ప్రకటించారు. భారత్‌తో పాటు, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్‌లకు చెందిన నౌకలకు కూడా  జలమార్గం గుండా సురక్షిత ప్రయాణానికి అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. 

కాగా, ఇరాన్‌ మీడియాతో అబ్బాస్‌ మాట్లాడుతూ.. చాలా దేశాలు హార్మూజ్‌ విషయంలో మమ్మల్ని సంప్రదించి, జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇవ్వాలని అభ్యర్థించారు. మేము మిత్రదేశాలుగా భావించే కొన్ని దేశాలకు అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. వీరికి మా సాయుధ దళాలు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాయి. భవిష్యత్తులో కూడా, యుద్ధం తర్వాత కూడా ఆయా దేశాల నౌకల ప్రయాణాలు కొనసాగుతాయి’ అని ఆయన తెలిపారు. 

ఈ విషయాన్ని ముంబైలోని ఇరాన్‌ కాన్సు లేట్‌ జనరల్‌ కార్యాలయం ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. దీంతో, హార్మూజ్‌ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత్‌ నౌకలు సరకులతో ఉండటం అవి స్వదేశం చేరేందుకు మార్గం సులువైంది. ఇప్పటికే ఐదు గ్యాస్‌ ట్యాంకర్లు హార్మూజ్‌ వద్ద అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు ఇటీవల వార్తలు బయటకు వచ్చాయి. ఇరాన్‌ నిర్ణయంతో వీటి ప్రయాణంపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరిన్ని నౌకలు కూడా భారత్‌లోని గమ్యస్థానాలకు చేరవచ్చు. అయితే, ఇరాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వమని తేల్చిచెప్పిన దేశాల నౌకలు మాత్రమే హార్మూజ్‌లో ప్రయాణించవచ్చని ఇప్పటికే ఇరాన్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement