టెహ్రాన్: అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ భారీ స్థాయిలో సైనిక సమీకరణ చేపట్టింది. దేశవ్యాప్తంగా మిలియన్‌కు పైగా యోధులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. ఇదే సమయంలో, ఇరాన్ అణు విధానంలో కీలక మార్పులకు సంకేతాలు ఇచ్చింది. అవసరమైతే అణు ప్రతిస్పందన కూడా పరిశీలిస్తామని అమెరికాకు హెచ్చరించింది.
ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ తస్నీమ్.. ‘ఇరాన్‌లో లక్ష మందికిపైగా అమెరికాతో భూతల యుద్ధానికి సిద్ధమయ్యారు. బసిజ్, ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్, ఆర్మీ నిర్వహిస్తున్న కేంద్రాల్లో యువకులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. అమెరికా సైన్యం ఇరాన్ నేలపై అడుగుపెడితే వారికి నరకం అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.’ అని నివేదించింది.
అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ భారీ స్థాయిలో సైనిక సమీకరణ చేపట్టింది. దేశవ్యాప్తంగా మిలియన్‌కు పైగా యోధులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. ఇదే సమయంలో, ఇరాన్ అణు విధానంలో కీలక మార్పులకు సంకేతాలు ఇచ్చింది. అవసరమైతే అణు ప్రతిస్పందన కూడా పరిశీలిస్తామని హెచ్చరించింది.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన మరణం తర్వాత ఇరాన్ ప్రభుత్వ పాలనపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) పట్టు సాధించింది.
ఈ క్రమంలో ఇరాన్‌లో అమెరికా భూతల దాడులకు సన్నద్ధమవుతుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో దేశం తన న్యూక్లియర్ విధానాన్ని కఠినతరం చేయాలని ఐఆర్‌జీసీలోని ప్రముఖులు బహిరంగంగా ఒత్తిడి పెంచుతున్నారు. అధికారికంగా ఇరాన్ ఇంకా అణ్వస్త్రాలను అభివృద్ధి చేయడం లేదని చెబుతున్నప్పటికీ.. ఇరాన్‌లోని రాజకీయ, సైనిక వర్గాల్లో అణ్వస్త్రాల వైపు వెళ్లాలా? అనే ప్రశ్న ఇప్పటివరకు లేనంతగా బలంగా, బహిరంగంగా చర్చకు వస్తోంది. అంటే అణు విధానంలో కఠిన మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయని తస్నీమ్ తెలిపింది.
అమెరికా సైనిక కదలికలు
అమెరికా 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ దళాలు త్వరలో పశ్చిమాసియా భూభాగంలోకి అడుగు పెట్టనున్నాయి. ఇప్పటికే వేలాది మంది సైనికులు మెరైన్లతో అక్కడికి చేరారు. ఈ కదలికలు ఇరు దేశాల మధ్య భూతల దాడులు సంభవించే అవకాశాలను మరింత బలపరుస్తున్నాయి.
ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల్ని తగ్గించేలా ఇరాన్‌తో శాంతి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయినప్పటికీ ట్రంప్ వ్యాఖ్యల్ని ఇరాన్ ఖండించింది. అమెరికా సైన్యం ఇరాన్ నేలపై అడుగుపెడితే తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.



