Double Masking: రెండు మాస్కులు ధరిస్తే కరోనా రాదా?

How And Why To Double Mask Dos And Donts - Sakshi

వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా వైరస్‌ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మాస్కు కచ్చితంగా ధరించాలని అందరికీ తెలుసు. రెండు మాస్కులు ధరిస్తే రెండింతల రక్షణ లభిస్తోందని తెలుసా? ఇలా ధరిస్తే వైరస్‌ బారినపడే అవకాశాలే లేవని అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజా పరిశోధనలో తేలింది. రెండు టైట్‌ ఫిట్‌ మాస్కులు సార్స్‌–కోవ్‌–2 సైజ్‌ వైరస్‌ను సమర్థంగా ఫిల్టర్‌ చేస్తాయని, నోరు, ముక్కులోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని ఈ పరిశోధన చెబుతోంది.

డబుల్ మాస్కుల వాడకం మంచిదే..
►మాస్కుల్లో ఎక్కువ బట్ట పొరలు వాడడం వల్ల వాటి మధ్య ఖాళీ స్థలం తగ్గిపోతుంది. ఖాళీ లేకపోతే లోపలికి వైరస్‌ ప్రవేశించే ఆస్కారం ఉండదు. కనుక వైరస్‌ కణాలను ఇది సాధ్యమైనంత వరకు అడ్డుకుంటుంది. 

►మాస్కు ముఖానికి సరిగ్గా అమరకపోతే రక్షణ పెద్దగా ఉండదు. కనుక డబుల్ మాస్కును ధరించడం వలన ముఖ భాగాన్ని వీలైనంత కవర్‌ చేస్తుంది. ఇందులో బట్ట పొరలను ఖాళీ లేకుండా బిగువుగా కలిపి కుట్టిన మాస్కు ఉత్తమమైనదని చెప్పారు.

►సాధారణ క్లాత్‌మాస్క్‌ 56.1 శాతం రక్షణ కల్పిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్‌ మాస్కు అయితే 51.4 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్‌ మాస్కుపై      క్లాత్‌మాస్కు ధరిస్తే కరోనా నుంచి రక్షణ 85.4 శాతం వరకు ఉంటుందన్నారు. క్లాత్‌ లేదా సర్జికల్‌ మాస్కు వలన 77 శాతం రక్షణను ఇస్తుంది.


ప్రయోజనాలు..
►డబుల్ మాస్కులు  వాడకం వలన మీకు శ్వాస పీల్చుకోవడంలో ఏ రకంగాను ఇబ్బందులు ఉండవు.
► డబుల్‌ మాస్కులు ధరించి సులభంగా మాట్లాడుకోవచ్చు.


చేయకూడనవి..
►వాడేసిన మాస్కులు రెండింటినీ గానీ, సర్జికల్ మాస్కులు రెంటిని కలిపి డబుల్ మాస్కులా వాడకూడదు
►మార్కెట్లో దొరుకుతున్న ఎన్‌95 మాస్క్‌ను ఏ ఇతర మాస్కు తో ఉపయోగించరాదు.
►రసాయన పదార్థాలను మాస్కు కు కలిపి ఉపయోగించరాదు.
►పాడైన, రంధ్రాలు పడినమాస్కులను వాడరాదు 


డబుల్ మాస్కును సరైన రీతిలో వాడుతున్నామనడానికి ఉదాహరణ
►మనం గాలి పీలుస్తున్నప్పుడు, మన మాస్కు లోపల వైపుకు వెళ్తున్నట్లు ఉండాలి
►అద్దాలు వాడే వారు గాలి వదిలినప్పుడు పొగతో వారి అద్దాలు కమ్ముకోవడం.
►అద్దం ముందు నిల్చుని మనం గాలిని బలంగా వదిలినప్పుడు మన కళ్లకు ఆ గాలి తగలడం.

 (చదవండి: ‘ఊపిరి’కి ఎందుకీ కష్టం?)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top