ప్రపంచ సంక్షోభమే.. జి–7 దేశాల ఆందోళన 

G7 Warns of Global Hunger Crisis Unless Russia lifts Ukraine Blockade - Sakshi

వీసెన్‌హాస్‌(జర్మనీ): ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం ప్రపంచ సంక్షోభంగా పరిణమిస్తోందని జి–7 విదేశాంగ మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ నుంచి ఆహార ధాన్యాలు ఎగుమతుల్లేక ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో ఆకలి కేకలు మొదలయ్యే ప్రమాదం ఉందన్నారు. రష్యా దళాలు ఉక్రెయిన్‌ నుంచి వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. రష్యాకు ఏ రూపంలోనూ సాయమందించినా తీవ్ర పరిణామాలుంటాయని చైనాను హెచ్చరించారు.

శనివారం ముగిసిన ఈ 3 రోజుల భేటీలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్‌ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులను ప్రారంభించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఉక్రెయిన్‌కు సాయం పెంచాలని తీర్మానించారు. ఆహార కొరతను అధిగమించే విషయంలో తమ మిత్రదేశాలకు అండగా నిలుస్తామని వెల్లడించారు. 

చదవండి: (Russia-Ukraine war: ఖర్కీవ్‌ నుంచి రష్యా సేనలు ఔట్‌!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top