Frida Kahlo Paintings: బాప్‌రే! ఈ పేయింటింగ్‌ ధర రూ. 260 కోట్లా!!

Frida Kahlo Self Portrait Sells For Record 35 Million - Sakshi

Frida Kahlo Self Portrait Painting: మెక్సికన్ దిగ్గజ  కళాకారిణి ఫ్రిదా కహ్లో వేసిన అరుదైన పెయింటింగ్ న్యూయార్క్ వేలంలో దాదాపు 35 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.260 కోట్లు ) అమ్ముడుపోయింది. అయితే ఈ చిత్రం గొప్పతనమేమిటంటే కళాకారిణి ఫ్రిదా తన స్వీయ చిత్రాన్ని తానే చిత్రించడమే కాక ఆ చిత్రంలో తన భర్త డియెగో రివెరా ముఖం తన నుదిటి పై ప్రతిబింబించేలా చిత్రిస్తుంది.

(చదవండి: ఇజ్రాయెల్‌ అందాల పోటీలో విజేతగా 86 ఏళ్ల బామ్మ)

పైగా ఈ పెయింటింగ్‌లో ఆమె  విలక్షణమైన కనుబొమ్మలతో చీకటి కళ్ళపై నుండి కొన్ని కన్నీటి చుక్కలు వస్తున్నట్లు చిత్రించింది. అంతేకాదు ఫ్రిదా ఈ పెయింటింగ్‌ని తన భర్త "డియెగో వై యో" పేరుతో  చిత్రించడం గమనార్హం. అయితే ఆమె భర్త డియెగో రివెరా మెక్సికన్ నటి ఫెలిక్స్‌తో సన్నిహితంగా మెలగడంతోనే ఆమె ఈ విధంగా  తన భర్త ముఖాన్ని తన నుదిటపై మూడవ కన్నుగా చిత్రీకరించిందంటూ కొంతమంది కళాకారులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈ పెయింటింగ్‌ అతను ఆమె ఆలోచనలను ఏ స్థాయిలో హింసించాడో అనేదాన్ని కూడా సూచిస్తుందని అంటున్నారు. ఈ మేరకు ఈ పేయింటింగ్‌ చరిత్రలో వేలంలో అత్యంత ఖరీదకు అమ్ముడుపోయిన లాటిన్‌ అమెరికా కళాకృతిగా నిలిచింది.

(చదవండి: వామ్మో! మొసలిని కౌగలింతలతో ఎలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో!!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top