Pegasus: ప్రిన్సెస్‌ ఫోన్‌ హ్యాక్‌ చేసిన మాజీ భర్త

Dubai Sheikh Mohammed Hacked Phones of Ex Wife Princess Haya - Sakshi

మాజీ భార్య ప్రిన్సెస్‌ హయాఫోన్‌ హ్యాక్‌ చేసిన దుబాయ్‌ పాలకుడు

దుబాయ్: దుబాయ్‌ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ తన మాజీ భార్య ప్రిన్సెస్‌ హయా బింట్‌, ఆమె న్యాయవాదుల ఫోన్‌లను హ్యాక్ చేయమని ఆదేశించినట్లు తెలిసింది. వారి పిల్లల కస్టడీకి సంబంధించిన ఇంగ్లండ్‌ హైకోర్టులో చైల్డ్-కస్టడీ ఫాక్ట్-ఫైండింగ్‌ కేసు నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీని విచారణలో భాగంగా మొహమ్మద్ తన మాజీ భార్య ప్రిన్సెస్‌ హయాను వెంటాడి.. బెదిరింపులకు గురి చేసినట్లు ఇంగ్లండ్ హైకోర్టు అభిప్రాయపడింది. ప్రిన్సెస్‌ హయా ఫోన్‌ హ్యాక్‌ చేయడం కోసం మహమ్మద్ అధునాతన "పెగసస్" సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించినట్లు తెలిసింది. 

ఇజ్రాయెల్ సంస్థ ఎన్‌ఎస్‌ఓ జాతీయ భద్రతా ప్రమాదాలను ఎదుర్కోవడానికి దేశాల కోసం ఈ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసింది. ఇది మనదేశలో కూడా పెగాసస్‌ పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొహమ్మద్‌.. తన మాజీ భార్య, జోర్డాన్ రాజు అబ్దుల్లా సోదరి ప్రిన్సెస్ హయా బింట్ అల్-హుస్సేన్‌తో పాటు ఆమెకు సన్నిహితంగా ఉన్న వారి ఫోన్‌లను హ్యాక్ చేయడానికి పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకున్నట్లు తెలిసింది
(చదవండి: మేఘాలకే షాకిచ్చి.. వానలు కురిపించి..)

మొహమ్మద్‌ కోసం పనిచేస్తున్న వారు బ్రిటిష్ రాజధాని సమీపంలోని హయా ఎస్టేట్‌కి ప్రక్కనే ఒక భవంతిని కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ చర్యలను ఇంగ్లండ్‌ కోర్టు తప్పుపట్టింది. హయాను వెంటాడే ఈ చర్యల వల్ల ఆమె ఎంతో అసురక్షితంగా ఫీలవుతుందని.. ఊపిరి కూడా పీల్చుకోలేకపోతుంది అని కోర్టు అభిప్రాయపడింది. 

మొహమ్మద్ తన ఇద్దరు కుమార్తెలను అపహరించాడని, వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడమే కాక వారి ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించాడని కోర్టు నిర్ధారించిన 19 నెలల తర్వాత తాజాగా తీర్పులు వెల్లడించింది. ఈ సందర్భంగా "తాజాగా వెల్లడయిన అంశాలు విశ్వాసాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు స్పష్టం చేస్తున్నాయి" అని ఇంగ్లండ్, వేల్స్‌లోని కుటుంబ విభాగం అధ్యక్షుడు జడ్జి ఆండ్రూ మెక్‌ఫార్లేన్ తన తీర్పులో వెల్లడించారు.
(చదవండి: ఒకప్పుడు ఇసుకతో ఎడారిగా.. ఇప్పుడు ప్రపంచంలోని అద్భుతాలకు.. )

మొహమ్మద్‌ షేక్ కోర్టు తీర్మానాలను తిరస్కరించారు, అవి అసంపూర్ణ వాస్తవాలపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. "నాపై చేసిన ఆరోపణలను నేను ఎప్పుడూ ఖండిస్తూనే ఉన్నాను.. ఇప్పుడు కూడా అదే చేస్తాను" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కొన్నేళ్ల క్రితం హయా(47), తన ఇద్దరు పిల్లలు జలీలా(13), జాయెద్‌లను తీసుకుని బ్రిటన్ పారిపోయారు.

అప్పటి నుంచి పిల్లల కస్టడీకి సంబంధించి మొహమ్మద్‌, హయాల మధ్య సుదీర్ఘమైన, ఖరీదైన న్యాయపోరాటం జరుగుతుంది. అంతేకాక హయా తన బ్రిటిష్ అంగరక్షకులలో ఒకరితో సంబంధం కలిగి ఉందనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. హ్యాకింగ్‌కు గురి అయిన వారిలో హయా తరఫు న్యాయవాది ఫియోనా షాక్‌లెటన్ కూడా ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో హ్యాకింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
(చదవండి: బాడీగార్డ్‌తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్‌)

హ్యాకింగ్ వార్తలు వెలుగు చూసిన తర్వాత పెగసస్‌ను దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు లభించినట్లయితే తాము చర్యలు తీసుకుంటామని.. యూఏఈతో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ఎన్‌ఎస్‌ఓ వెల్లడించినట్లు హయా తరఫు న్యాయవాది తెలిపారు. ఈ విషయంపై ఎన్‌ఎస్‌ఓ స్పందించలేదు. 

చదవండి: ప్రపంచమే హాయిగా నిద్రపోతోంది

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top