బాడీగార్డ్‌తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్‌

Dubai Princess Haya Paid 120000 Dollars To Keep Affair With Bodyguard Secret - Sakshi

దుబాయ్‌: దుబాయ్‌ పాలకుడి భార్య ఆమె బాడీగార్డుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీని గురించి బయటకు వెళ్లడించకుండా ఉండటానికి అతడికి భారీ ఎత్తున నగదు.. ఖరీదైన బహుమతులు ఇచ్చిందనే వార్తలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మెయిల్‌ ఆన్‌లైన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్‌ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆరవ భార్య హయా గత రెండేళ్లుగా బ్రిటీష్‌ బాడీగార్డు రస్సెల్‌ ఫ్లవర్స్‌తో అక్రమ సంబంధం నెరపుతుంది. దీని గురించి రహస్యంగా ఉంచడం కోసం అతడికి 1.2మిలియన్‌ డాలర్ల నగదు(రూ. 8,88,59,400)తోపాటు 12 వేల డాలర్ల విలువైన వాచ్‌, అరుదైన షాట్‌గాన్‌ ఇచ్చినట్లు మెయిల్‌ ఆన్‌లైన్‌ వెల్లడించింది. రస్సెల్‌ భార్య మాట్లాడుతూ.. ‘హయా నా భర్తకు భారీ ఎత్తున నగదు, ఖరీదైన బహుమతలు ఇచ్చి లొంగదీసుకుంది.. తనని ఆమె దగ్గరే ఉంచుకుంది’ అని తెలిపింది. వీరిద్దరి బంధం గురించి తెలియడంతో రస్సెల్‌ భార్య ఎంతో బాధపడిందని.. వారి నాలుగేళ్ల బంధానికి ముగింపు పలికేందుకు సిద్దమయ్యిందని మెయిల్‌ ఆన్‌లైన్‌ తెలిపింది. (ఫేస్‌మాస్క్‌లు చోరీ :  సంచలన తీర్పు)

ప్రిన్సెస్‌ హయా, ఆమె 70 ఏళ్ల మాజీ భర్త మధ్య హైకోర్టు విచారణ సందర్భంగా బాడీగార్డుతో ఆమెకున్న రహస్య సంబంధం వెలుగులోకి వచ్చింది. లండన్ హైకోర్టులో చైల్డ్-కస్టడీ ఫాక్ట్-ఫైండింగ్‌లో భాగంగా ఈ వివరాలు వెలువడ్డాయి. ప్రిన్సెస్‌ హయా తన మగ అంగరక్షకులలో ఒకరితో అక్రమ సంబంధం కలిగి ఉందని దీనిలో పేర్కొన్నారు. ప్రస్తుతం హయా తన ఇద్దరు పిల్లలతో వెస్ట్‌ లండన్‌లోని కెన్సింగ్టన్‌లో నివాసం ఉంటున్నారు. 

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top