ఫేస్‌మాస్క్‌లు చోరీ :  సంచలన తీర్పు

6 jailed, fined Dh150,000 for stealing face masks in Dubai - Sakshi

దుబాయ్‌: ఒక దొంగతనం కేసులో దుబాయి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.  ఫేస్‌ మాస్కులను ఎత్తుకుపోయిన గ్యాంగ్‌కు మూడేళ్ల జైలుశిక్ష, 1.5 దిర్హామ్‌ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అంతేకాదు జైలు జీవితం అనంతరం తర్వాత నిందితులను దేశం నుంచి బహిష్కరించాలదుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఆదేశించింది. (కరోనా రోగులకు రెమిడెసివిర్‌ ఇవ్వొద్దు : డబ్ల్యూహెచ్‌వో)

కరోనా మహమ్మారి కాలంలో ఫేస్‌ మాస్క్‌లు చాలా అవసరమైన వస్తువుగా మారిపోయాయి. దీంతో  మాస్క్‌ల చోరీపై దృష్టి పెట్టిందో గ్యాంగ్‌. దుబాయిలో నివసిస్తున్న ఆరుగురు పాకిస్థానీలు అల్ రషీడియాలోని ఒక వేర్‌హౌస్‌లోకి అక్రమంగా ప్రవేశించి 1.5 లక్షల దిర్హామ్‌లు (రూ.30.28 లక్షలు) విలువ చేసే 156 బాక్సుల ఫేస్‌మాస్క్‌లను దొంగిలించారు.  స్థానిక పారిశ్రామిక ప్రాంతంలోని గిడ్డంగి నుంచి 150,000 దిర్హామ్‌ల‌ విలువైన 1000 ఫేస్ మాస్క్‌లున్న156 బాక్స్‌లు చోరికి గురైనట్టు గుర్తించిన 38 ఏళ్ల చైనా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్18 న ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొద్ది రోజుల్లోనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తాము దొంగిలించిన మాస్క్‌లను బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తికి అమ్మినట్టు నిందితులు అంగీకరించారు. తాము గతంలో కూడా అనేక ఇతర దొంగతనాలకు పాల్పడినట్లు  ఒప్పుకున్నారు. దీనిపై విచారణ అనంతరం  కోర్టు తాజా తీర్పు వెలువరించింది. (అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top