కొవ్వు కరిగించే మందుతో కరోనా కట్టడి! | Drug used to reduce blood fats may use to treat for corona virus by 70 per cent:Study | Sakshi
Sakshi News home page

corona virus: కొవ్వు కరిగించే మందుతో కరోనా కట్టడి!

Aug 7 2021 7:35 AM | Updated on Aug 7 2021 7:35 AM

 Drug used to reduce blood fats may use to treat for corona virus by 70 per cent:Study - Sakshi

లండన్‌: రక్తంలో అసాధారణ స్థాయిలో ఉన్న కొవ్వు పదార్ధాలను తొలగించేందుకు వాడే ఒక మందు కరోనా వైరస్‌ను 70 శాతం వరకు కట్టడి చేస్తోందని తాజా అధ్యయనం తెలిపింది. యూకేలోని బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో కొవ్వు తగ్గించేందుకు వాడే ఫీనోఫైబ్రేట్‌ ఔషధం కోవిడ్‌19 వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ను బాగా తగ్గిస్తున్నట్లు తెలిసింది. వైరస్‌ వ్యాప్తిని కరోనా తీవ్ర ప్రభావాన్ని ఫీనో ఫైబ్రేట్‌ తగ్గిస్తున్నట్లు తేలిందని పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఎలిసా విసెంజి చెప్పారు. ఈ మందును రక్తంలో కొవ్వు తగ్గించేందుకు వాడతారు.

నోటి ద్వారా తీసుకునే ఈ మందు ప్రపంచవ్యాప్తంగా చౌకగానే లభిస్తోందని, దీనివల్ల దుష్పరిణామాలు తక్కువేనని ఎలిసా చెప్పారు. కరోనాపై దీని వాడకానికి ముందు క్లీనికల్‌ ట్రయిల్స్‌ జరపాలని, ట్రయిల్స్‌లో సత్ఫలితాలు వస్తే అల్పాదాయ దేశాలకు వరంగా ఈ మందు మారుతుందని చెప్పారు. టీకా తీసుకోవడం కుదరని వారికి ఈ ఔషధం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రక్తంలో ఫ్యాట్‌ కంటెంట్‌ తగ్గించేందుకు ఈ మందు వాడవచ్చని యూఎస్‌ ఎఫ్‌డీఏతోపాటు పలు దేశాల ఔషధ నియంత్రణా సంస్థలు అనుమతినిచ్చాయి. మనిషి కణాల్లోకి కరోనా ప్రవేశాన్ని కల్పించే చర్యను ఈ ఔషధం సమర్ధవంతంగా అడ్డుకుంటున్నట్లు తాజా పరిశోధన వెల్లడిస్తోంది. దీని ఆధారంగా కరోనాపై ఫీనోఫైబ్రేట్‌ ప్రభావాన్ని అధ్యయనం చేసే క్లీనికల్‌ ట్రయిల్స్‌ ప్రస్తుతం యూఎస్, ఇజ్రాయిల్‌లో జరుగుతున్నాయి.  అలాగే డెల్టా వేరియంట్‌పై ఈ ఔషధ ప్రభావాన్ని గుర్తించేందుకు సైతం పరిశోధనలు జరుగుతున్నాయి.  

చదవండి :  Women's Hockey: కన్నీరు మున్నీరైన అమ్మాయిలు, అనునయించిన మోదీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement